చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సరిగ్గా వండాలే గాని కడుపునిండా తినడానికి ఇష్టపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కేవలం చికెన్ కి సంబంధించి ఒక షాప్ ను పెట్టారు. దాని పేరే కేఎఫ్ సీ. దోరగా వేయించిన మాంసాన్ని బకెట్లు గా అందజేసి కస్టమర్ల సంతృప్తి పరుస్తున్నారు. ఇలా షాప్ కి వచ్చిన వినియోగదారుల ఫేస్ మీద చిరునవ్వుతో పంపిస్తుంది ఈ సంస్థ. అయితే ఏడాది వినూత్న ప్రయోగానికి తెర లేపాలని భావిస్తోంది. మాంసం తినని వారికోసం వెజ్ నీ కూడా ఈ సంస్థ త్వరలో తీసుకురానున్నట్లు తెలిపింది. మొక్కల ద్వారా పండించే చికెన్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. బియాండ్ మీట్ పేరుతో ఈ వెజ్ చికెన్ ను ఈ నెల 10 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. కస్టమర్లకు సరికొత్త రుచులను అందించాలనే ఉద్దేశ్యం తో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ బియాండ్ మీట్ పై ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మాంసం కానీ మాంసాన్ని వినియోగదారులకు అందించేందుకు తాము చాలా కాలం ఎదురు చూసినట్లు వివరించారు.
ఈ నెల పదో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బియాండ్ చికెన్ అనే మాంసం కానీ మాంసం ను కస్టమర్లకు అందిస్తామని సంస్థ తెలిపింది. అయితే ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ బియాండ్ చికెన్ ని కృత్రిమ పద్దతిలో లాబ్స్ లో మొక్కలను పెంచుతున్నారు. ఈ సంస్థ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని చాలా కంపెనీలు స్వాగతిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి ప్రయోగాత్మక అంశాలను పరిగణనలోకి తీసుకొని మిగతా సంస్థలు కూడా పాటించాలని యోచిస్తున్నారు.
లాబ్స్ లో పెంచుతున్న ఈ చికెన్ మొక్కలలో మాంసం తక్కువ మొత్తంలో ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. కానీ వీటినీ వెజ్ గానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రయత్నంలోనే ఉన్నట్లుగా చెప్పారు. చాలా మంది కస్టమర్లు చికెన్ తో పాటు వెజ్ ఫ్రైడ్ రుచులను కూడా ఇష్టపడతారని కూడా చెప్పారు. అలాంటి వారి కోసమే బియాండ్ మీట్ ని మార్కెట్ లోకి తీసుకుని వస్తున్నట్లు స్పష్టం చేశారు సంస్థ ప్రతినిధులు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుని మొక్కల ఆధారిత మాంసంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
సంస్థ చెప్తున్న దానిని బట్టి చూస్తే జనవరి10 నుంచి ఈ బియాండ్ మీట్ అమెరికా లో వెజ్ ప్రియుల కోసం సుమారు 4 వేల రెస్టారెంట్లలో అందుబాటులోకి రానుంది. ఇంకేం వెజ్ ప్రియులు... కేఎఫ్ సీ తినలేనదని ఇన్నాళ్లు నిరాశ చెందారు కదా.. ఇకపై హాయిగా మీరు కేఎఫ్ సీని లాగేంచేయచ్చు...!