చాలామంది ఐటీ ఉద్యోగులకు గూగుల్ లో పని చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. అదే సమయంలో గూగుల్ లో పని చేసే ఉద్యోగి ఎవరైనా.. తన జాబ్ కు రిజైన్ చేస్తున్నట్లు చెబితే.. పక్కన బాంబు పడినట్లుగా అదిరిపడి.. ‘‘ఆర్ యూ ష్యూర్’’ అంటూ అడగటం కనిపిస్తుంది. లక్షలాది మందికి కలల సౌధమైన గూగుల్ జాబ్ ను వదులుకోవటం అంటే మాటలు కాదు కదా.
ఇంతలా గూగుల్ లో ఉద్యోగం కోసం ఎందుకంత ఆసక్తి ప్రదర్శిస్తారన్న విషయాన్ని చూస్తే.. అందులో ఆసక్తికర అంశాలు చాలానే కనిపిస్తాయి. గూగుల్ ఉద్యోగికి ఉండే స్వేచ్ఛ.. ఉద్యోగుల అవసరాల విషయంలో కంపెనీ చూపించే శ్రద్ద ఒక రేంజ్ లో ఉంటాయి మరి.
గూగుల్ లో ఉద్యోగుల సౌకర్యాలు మచ్చుకు చూస్తే..
= మిగిలిన ఆఫీసుల మాదిరి గూగుల్ లో ఉద్యోగులకు డ్రెస్ కోడ్ ఉండదు. ఒళ్లంతా టాటూలు వేసుకొని వెళ్లినా ఎవరూ ఏమీ అనరు.
= అంతదాకా ఎందుకు.. ఉద్యోగికి మూడ్ లేదని కూడా సెలవు పెట్టేయొచ్చు (కాకపోతే కొంత పరిమితులు ఉంటాయి సుమా)
= గూగుల్ లో పని చేసే ఉద్యోగుల్ని గూగులర్లు అని పిలుస్తుంటారు. ఇక.. కొత్తగా చేరిన వారిని నూగ్లర్ అని పిలుస్తారు.
= ఒకచోటే కూర్చొని పని చేయాలన్న రూల్ గూగుల్ లో ఉండదు. ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ పని చేయొచ్చు.
= గాలి మార్పు కోసం ఎక్కడైనా కూర్చోని పని చేసుకోవచ్చు.
= కంపెనీలో క్యాంటిన్ మొదలు.. లైబ్రరరీ.. టాయిలెట్స్.. జిమ్.. ఇలా ఎక్కడికైనా సరే స్కేట్ బోర్డు.. సైకిళ్ల మీద ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది.
= కాసేపు రిలాక్స్ కావటానికి జిమ్ కు వెళ్లి రావొచ్చు కూడా. ఆటలు ఆడుకోవచ్చు కూడా.
= ఉద్యోగులు తమ సొంత ఐడియాలతో పని చేయటానికి రోజులో 20 శాతం సమయాన్ని వినియోగించుకోవచ్చు.
= పెంపుడు జంతువుల్ని కూడా తీసుకెళ్లే వెసులుబాటు.
= ఉద్యోగులకు మూడు పూటలా భోజనం.. అది కూడా వారు కోరుకున్న మెనూను సిద్ధం చేయటం ఉంటుంది.
= స్నేహితులు.. బంధువులు ఎవరైనా ఆపీసుకు గెస్ట్ గా వస్తుంటే.. వారికి సంబంధించిన మెనూను ఒక రోజు ముందు చెబితే ఏర్పాటు చేస్తారు.
= ఫుడ్ కోసం అట్టే తిరగాల్సిన అవసరం లేకుండా.. ప్రతి 150 అడుగల దూరంలో ఒక ఫుడ్ సెంటర్ ఉంటుంది.
= పర్యావరణ హితం కోసం ఉద్యోగులు హైబ్రిడ్ కార్లు వినియోగించటానికి వీలుగా ఒక్కో ఉద్యోగికి 5వేల డాలర్లు రాయితీ ఇస్తుంది.
= పెళ్లి చేసుకునే సమయంలో.. పిల్లలుపుట్టిన సమయంలోనే ప్రత్యేక సదుపాయాలు.. ప్రోత్సాహకాలు మామూలే.