అందరు ఇలా చేస్తే ఎలా ?

Update: 2021-07-15 04:47 GMT
కరోనా మహమ్మారి పుణ్యమా అని అందరూ ఎప్పుడు వినని పదాలని విన్నారు, కలలో కూడా చూస్తాము అనుకోని రోజులని చూశారు. అంతా కరోనా మహమ్మారి మాయాజాలం. ఇదిలా ఉంటే .. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే స్థంబించిపోయారు. కొన్ని రోజుల తరబడి అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో ఉద్యోగులు ఆఫీస్ పనులు , విద్యార్థుల చదువులు మొత్తం ఆన్ లైన్ లోనే జరిగాయి..ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ , స్టూడెంట్స్ కి ఆన్ లైన్ క్లాసులు పెట్టడంతో వీడియో   కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌ కి డిమాండ్ ఒక్కసారిగా గణనీయంగా పెరిగిపోయింది.  

అయితే ఒకేసారి ఎక్కువ మందితో మాట్లాడగలిగే వీలున్న యాప్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు యూజర్లు. అందుకే జూమ్ యాప్ బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే జూమ్ యాప్ ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇతర యాప్స్‌పై దృష్టిపెట్టారు యూజర్లు. అలాగే జూమ్ కి మనీ పే చేయాలి. ఇప్పటికే గూగుల్‌కు చెందిన మీట్ యాప్ అందుబాటులో ఉంది. గతంలో ఉన్న హ్యాంగ్ అవుట్ యాప్‌ ను గూగుల్ మీట్‌ గా మార్చిన సంగతి తెలిసిందే.  గూగుల్ మీట్ యాప్‌ లో సరికొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.  

గూగుల్ మీట్‌ లో ఒకేసారి నలుగురితో మాట్లాడే అవకాశం మాత్రమే ఉండేది. ఆ సంఖ్యను ఆ తర్వాత 16 కి పెంచేసింది. అంటే గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మంది వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ మీట్‌ను యూజర్లకు మరింత ఉపయోగపడేలా రూపొందించడం విశేషం. వెలుతురు సరిగ్గా లేకపోయినా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ సాయంతో లైటింగ్ అడ్జెస్ట్ అవుతుంది. కాబట్టి అవతలివాళ్లకు సరిగ్గా కనిపించట్లేదన్న టెన్షన్ ఉండదు. ఇక యూజర్లు తమ విండో, స్క్రీన్ మాత్రమే కాదు క్రోమ్ ట్యాబ్‌ ని కూడా షేర్ చేసే ఆప్షన్ కూడా ఆ తర్వాత తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఏ యూజర్లైనా ఎంత సేపైనా గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఇక పై మాత్రం అలా సాధ్యం కాదు. ఎందుకంటే గ్రూప్ కాల్స్ కోసం గూగుల్ ప్రస్తుతం డ్యూరేషన్  లిమిట్ పెడుతోంది. ఇది కేవలం ఉచితంగా గూగుల్ సేవలను ఉపయోగిస్తున్న పర్సనల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రొఫెషనల్ యూజర్లు ఇంతకుముందు లాగే తమ సేవలను కొనసాగించవచ్చు. ముగ్గురు కంటే ఎక్కువ మంది పాల్గొనే మీటింగ్స్ ఇక పై కేవలం గంట పాటు మాత్రమే కొనసాగనున్నాయి. ఒక ఫ్రీ గూగుల్ అకౌంట్ నుంచి ఈ మీటింగ్ ని ప్రారంభిస్తే కనుక ఆ మీటింగ్ ని కేవలం గంట పాటు మాత్రమే కొనసాగించే వీలుంటుంది. ఆ తర్వాత మీటింగ్  అదే ఎండ్ అయిపోతుంది.

జూమ్ ఇప్పటికే ఇలాంటి లిమిట్ పెడుతోంది. అందులో కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గూగుల్ మీట్ కూడా దాన్ని పాటించాలని నిర్ణయం తీసుకుంది. అయితే 55 నిమిషాల తర్వాత మీటింగ్ లో ఉన్నవారందరికీ ఇంకో 5 నిమిషాల్లో మీటింగ్ పూర్తవుతుందన్న నోటిఫికేషన్ వస్తుందని ఒకవేళ గంట సమయంలో ఇలా కాల్ పూర్తి కాకుండా ఉండేందుకు గూగుల్ అకౌంట్‌ ను అప్ గ్రేడ్ చేసుకోవాలని గూగుల్ సంస్థ వెల్లడిస్తోంది. అయితే ఇది కేవలం గ్రూప్ కాల్స్ కి మాత్రమే పరిమితం కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్న జూమ్ మీటింగ్స్ 24 గంటల పాటు ఉచితంగా ఎంతసేపైనా మాట్లాడుకునే వీలుంటుంది.

గూగుల్ సంస్థ తమ ఫ్రీ గూగుల్ మీట్ కాల్స్ ని అందించే పరిమితిని ప్రతి కొన్ని నెలలకు ఒకసారి పెంచుతూ వస్తుంది. మార్చి 2020 లో అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తున్న తరుణంలో గూగుల్ తమ గూగుల్ మీట్ హ్యాంగవుట్స్ ని ప్రతి ఒక్కరు ఉచితంగా ఉపయోగించవచ్చని వెల్లడించింది. ముందు ఈ సేవలను సెప్టెంబర్ 2020 వరకు ఆ తర్వాత మరోసారి మార్చి 2021 వరకు తాజాగా జూన్ 2021 వరకు పెంచింది. ముగ్గురు లేదా అంతకు మించిన సంఖ్యలో వీడియో కాల్‌లో పాల్గొనాలకునే వారు గూగుల్ మీట్‌లో 60 నిమిషాలపాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. 55 నిమిషాల తర్వాత గ్రూప్‌ కాల్‌లో పాల్గొనేవారి స్క్రీన్‌ మీద ఐదు నిమిషాల్లో కాల్ ముగిసిపోతుందనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ కాల్ కొనసాగించాలంటే హోస్ట్‌ తన గూగుల్‌ ఖాతాను అప్‌ గ్రేడ్ చేసుకోవాలి అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే వన్‌-టు-వన్‌ కాల్స్‌పై ఎలాంటి టైం పరిమితి లేదని, 24 గంటలపాటు నిరంతరాయంగా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. అన్‌లిమిటెడ్ గ్రూప్‌ వీడియో కాల్స్‌ కోసం తమ ఖాతాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునేవారు నెలకు సుమారు రూ.745  చెల్లించాల్సి ఉంటుంది. అయితే , వర్క్ ఫ్రమ్ హోమ్ , విద్యార్ధులకి ఆన్లైన్ విద్యాబోధన జరుగుతున్న తరుణంలో ఒక్కో ప్లాట్ ఫామ్ ఇలా తమ పప్లాట్ ఫామ్ ఉపయోగించుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే నియమాన్ని తీసుకురావడంపై చాలామంది ఫైర్ అవుతున్నారు. ప్రొఫెషనల్ యూజర్లు కానీ వారి పరిస్థితి ఏంటి , నెలకి అంత డబ్బు కట్టలేని విద్యార్థుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News