గూగుల్ ను దెబ్బకొట్టిన రిపబ్లిక్ డే

Update: 2016-01-26 07:27 GMT
ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ ప్రతి సందర్భంలో ప్రత్యేక డూడుల్స్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగానూ ప్రత్యేక డూడుల్‌ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.  ఇందుకోసం ప్రత్యేకమైన డూడుల్ ను తన హోం పేజిలో ఉంచింది. ఇప్పటివరకు విడుదల చేసిన డూడుల్స్‌ కు భిన్నంగా.. భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన కామెల్‌ కంటింజెంట్‌ తో కూడిన చిత్రాన్ని విడుదల చేసింది. గూగుల్‌ రూపొందించే ప్రతి డూడుల్‌ లో యానిమేషన్‌ ఉండగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమేషన్‌ లేని డూడుల్‌ ను రూపొందించడం విశేషం.

అంతవరకు బాగానే ఉన్నా... పాపం గూగుల్ డూడుల్ లో కనిపించిన ఒంటెల దళం ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో కనిపించలేదు. భారత గణతంత్ర ఉత్సవాల చరిత్రలో తొలి సారిగా కేమెల్ కావల్రీకి చోటు దక్కలేదు. సరిహద్దు భద్రతా దళానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ కేమెల్ కావల్రికి 67వ గణతంత్ర వేడుకలలో పరేడ్ చేసే అవకాశం లభించలేదు. ఈ పరేడ్ కోసం ఈ దళం గత కొన్ని నెలలుగా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ దీనిని రిహార్సల్స్ లో అవకాశం కల్పించలేదు. కేమెల్ కావల్రీకి సంబంధించి అధికారిక ఆదేశాలేవీ జారీ కాకపోవడమే ఇందుకు కారణం. కేమెల్ కావల్రి 1950 నుంచి గత ఏడాది వరకూ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా ఉంది. ఇంతవరకూ ఒక్కసారి కూడా మిస్ కాని ఈ కేమెల్ కేవల్రీ ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో కనిపించలేదు. కానీ, గూగుల్ మాత్రం దాన్ని డూడుల్ గా ఎంచుకుంది. అయితే... రిపబ్లిక్ డేలో కనిపించని ఒంటెలు డూడుల్ లో కనిపించడంతో కొందరు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Tags:    

Similar News