రాష్ట్ర గవర్నర్ అన్నంతనే రబ్బర్ స్టాంప్ అన్న భావన పలు రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా రాష్ట్ర గవర్నర్ పదవి ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని తెలిసేలా చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ గా నియమితులై.. మోడీ సర్కారులోనూ కొనసాగిన గవర్నర్ గా నరసింహన్ రికార్డు ఒక ఆసక్తికరమైతే.. టర్మ్ ముగిసిన తర్వాత కూడా ఆయనకు మరోసారి ఛాన్స్ లభించటం ఆయన సమర్థతకు లభించిన అవకాశంగా చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే..నరసింహన్ మరో రికార్డునుసొంతం చేసుకున్నారు. ఒక గవర్నర్ తన పదవీ కాలంలో అత్యధిక ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేసిన ఘనత ఆయన సొంతం. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన ఆయన.. విభజన తర్వాత తెలంగాణకు కేసీఆర్ ను.. ఏపీకి చంద్రబాబు చేత ప్రమాణస్వీకారం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ చేత మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన ఆయన.. తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇలా తన పదవీకాలంలో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన రికార్డును నరసింహన్ సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు.