దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలోని టీఆర్ ఎస్... రెండో సారి జరిగిన ఎన్నికల్లో బంపర్ విక్టరీని అందుకుంది. తొలిసారి వచ్చిన మెజారిటీ కంటే కూడా రెండో సారి వచ్చిన మెజారిటీనే అధికం. అయినా అధికారంలో ఉండే పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉంటుందన్న విషయం ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే. ఈ లెక్కన... రెండో సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించినా కూడా... తొలి సారి వచ్చిన మెజారిటీ కంటే తక్కువ సీట్లు రావాలి. కానీ కేసీఆర్ విషయంలో మాత్రం ఈ సీన్ రివర్సైంది. తొలి సారి వచ్చిన మెజారిటీ కంటే రెండో సారి ఏకంగా ఓ 20 సీట్లకు పైగా అధిక సీట్లను టీఆర్ ఎస్ సంపాదించింది. ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్ సిద్ధహస్తుడని - ఈ కారణంగానే విపక్షాలను ఏమార్చిన కేసీఆర్ ప్రజలను తన వైపునకు తిప్పుకున్నారని - ఇదంతా ఎన్నికల స్టంట్ అనీ... అదనీ - ఇదనీ పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగాయి.
అయితే కేసీఆర్ బంపర్ విక్టరీకి అసలు కారణమేమిటన్న విషయాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ చాలా విస్పష్టంగా చెప్పుకొచ్చారు. అది కూడా ఏ ప్రైవేట్ ప్రసంగంలోనో కాదండోయ్. భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి చేసిన ప్రసంగంలో గవర్నర్ ఈ అంశాన్ని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయినా కేసీఆర్ బంపర్ విక్టరీకి నరసింహన్ చెప్పిన కారణం ఏంటంటే... కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ - అభివృద్ధిద పథకాలు తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకోవడమేనట. అంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ ఎస్ కు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టాయని స్వయంగా గవర్నర్ చెప్పారన్న మాట. నేటి ఉదయం గణతంత్ర వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తెలంగాణ ప్రభుత్వ అధికారిక వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఆసక్తికర ప్రసంగం చేశారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని చెప్పిన గవర్నర్... దేశనిర్మాణంలో తెలంగాణ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని కీర్తించారు.
గత నాలుగున్నరేళ్లలో రాష్ట్ర నిర్మాణానికి మంచి అడుగులు పడ్డాయనీ. వినూత్న ఆలోచనలతో సీఎంగా కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా.. రాష్ట్ర పునర్నిర్మాణ చర్యలు చేపట్టారని నరసింహన్ కొనియాడారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రజల మనుసులు గెలుచుకున్నాయని, అందుకే మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టారని గవర్నర్ పేర్కొన్నారు. ఏటా రూ.40 వేలకోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని... తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒక్కటైన సాగునీటి సాధనకోసం కోటి 25 లక్షల ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ రబీ నుంచే కాళేళ్వరం ప్రాజెక్టు ఫలాలు తెలంగాణ ప్రజలకు అందేలా వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో భగర్భ జలాలు పెరిగాయని... ప్రతి వ్యక్తికి రక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, ఆవాసాలకు మంచినీరు అందుతున్నాయని... రైతుబంధు పథకం జాతీయ ఎజెండాగా మారిందని ఆయన ప్రశంసించారు. కేసీఆర్ కిట్‌తో మాతాశిశు మరణాలు తగ్గాయని చెప్పిన గవర్నర్.... నిబద్ధతతో కూడిన పరిపాలన కారణంగానే కేసీఆర్ మరోసారి గెలుపొందారని చెప్పుకొచ్చారు. మొత్తంగా కేసీఆర్ విక్టరీ రహస్యాన్ని గవర్నర్ ఈ విధంగా వివరించారన్న మాట.