అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియ‌న‌ట్లు చిలిపి..!

Update: 2018-08-28 05:35 GMT
ఏయ్.. ఏయ్.. చిలిపి.. భ‌లే మాట్లాడ‌తావే అంటూ మాట్లాడ‌టం కొంద‌రి నోటి నుంచి వింటుంటాం. ఇప్పుడు ఇంచుమించే అలాంటి ప‌రిస్థితే తెలంగాణ రాష్ట్రంలోని ప‌లువురి నోటి నుంచి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముంద‌స్తుపై గ‌డిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌సారి డిసైడ్ అయి.. ఫిక్స్ అయ్యాక‌.. అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గ‌ని కేసీఆర్‌.. ఇప్పుడు ముంద‌స్తు దిశ‌గా పావులు క‌దుపుతున్న వైనం తెలిసిందే.

ఎవ‌రి మాట‌ల‌కు ప‌డిపోని ముదురు మోడీ సైతం.. కేసీఆర్ మాట‌ల‌కు ఫిదా అయ్యార‌ని.. ఆయ‌న కోరిన‌వ‌న్నీ త‌క్ష‌ణ‌మే పూర్తి చేయాల‌న్న మౌఖిక ఆదేశాల్ని జారీ చేసిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ ముంద‌స్తుకు.. మోడీ సంపూర్ణ స‌హ‌కారం అందిస్తానన్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వేళ‌.. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నుంచి వ‌స్తున్న ఎంక్వ‌యిరీ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యేలా చేస్తోంది.

మెజార్టీ ప్ర‌భుత్వం అసెంబ్లీ ర‌ద్దుకు సిఫార్సు చేస్తే.. తానేం చేయాల‌ని.. త‌న పాత్ర ఏమిట‌న్న అంశాన్ని ప‌లువురు న్యాయ నిపుణుల‌ను.. రాజ్యాంగ నిపుణుల స‌ల‌హాను కోరుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ మాట విన్నంత‌నే.. అవన్నీ  తెలిసి మ‌రీ.. భ‌లే డౌట్లే.. చిలిపి అన్న మాట నోటి నుంచి రాక మాన‌దు. తానేం చేయ‌నున్నా.. ఆ విష‌యాల‌న్ని గ‌వ‌ర్న‌ర్  న‌ర‌సింహ‌న్ కు చెప్పి చేయ‌టం కేసీఆర్ కు అల‌వాటు.

దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా గ‌వ‌ర్న‌ర్.. ముఖ్య‌మంత్రుల మ‌ధ్య అన్నేసి భేటీలో మ‌రెక్క‌డా క‌నిపించ‌వు. ఇందుకు భిన్నంగా న‌ర‌సింహ‌న్.. గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య భేటీ త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ముంద‌స్తు నిర్ణ‌యాన్ని కేసీఆర్ కానీ తీసుకుంటే.. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న మ‌న‌సులోకి వ‌చ్చినంత‌నే ఎవ‌రితో చ‌ర్చించార‌న్న ఆప్ష‌న్ల‌లోకి వెళితే.. మొద‌టి మూడు పేర్ల‌లో గ‌వ‌ర్న‌ర్ పేరు ఒక‌టి రాక మాన‌దు. అయిన‌ప్ప‌టికీ.. క‌థ‌ను ర‌క్తి క‌ట్టించేందుకు వీలుగా.. త‌న పాత్ర ఏమిట‌న్న విష‌యాన్ని నిపుణుల్ని అడ‌గ‌టం ద్వారా.. గ‌వ‌ర్న‌ర్ త‌న పాత్ర‌కు తాను న్యాయం చేస్తున్న‌ట్లుగా చెప్పాలి.

మెజార్టీ ఉన్న‌ప్ర‌భుత్వ‌మే అయినా.. స‌భా నాయ‌కుడు తీసుకునే నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న విన‌తిని అంగీక‌రించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. స‌భ‌ను ర‌ద్దుచేయాలంటూ కేబినెట్ సిఫార్సును గ‌వ‌ర్న‌ర్ ఆమోదించాల్సి ఉంటుంద‌ని.. ఇక్క‌డ గ‌వ‌ర్న‌ర్ త‌న విచ‌క్ష‌ణ‌ను అమ‌లు చేసే వీలు లేద‌ని చెబుతున్నారు. ఎప్ప‌టిలానే.. ఇలాంటి విష‌యాల్లో కొన్ని క‌న్ఫ్యూజింగ్ స్టేట్ మెంట్లు వ‌స్తుంటాయి. అలాంటివే తాజాగా వ‌స్తున్నాయి. స‌భా నాయకుడిగా సంపూర్ణ మెజార్టీ ఉన్న ముఖ్య‌మంత్రి స‌భ‌ను ర‌ద్దు చేయాల‌న్న ప్ర‌క‌ట‌న చేయ‌టం సాధ్యం కాద‌ని చెబుతున్నా.. ప్రాక్టిక‌ల్ గా అలాంటి ఇబ్బందులేమీ ఎదురు కావ‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితే ఉంటే.. కేసీఆర్ అలాంటి వాటి మీదే ముందు ఫోక‌స్ చేస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News