తమిళనాడులో ఇప్పుడు నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠ నెలకొంది! ఎప్పుడు ఏం జరుగుతుందో? అధికార పీఠం ఎవరి వశం అవుతుందో? ఏ నిముషానికి ఎలాంటి మార్పులు చూడాలో అని అటు రాజకీయ వర్గాలు - ఇటు సాధారణ ప్రజానీకం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సలహా కోసం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ విద్యాసాగర్ రావ్.. ఇప్పుడు తిరిగి తమిళనాడు చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీలో ఎలాంటి చర్చలు జరిగాయో? ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ జరుగుతుందో? అని నేతలు నరాలు బిగబట్టి మరీ చూస్తున్నారు.
రాష్ట్రంలో అమ్మ జయలలిత మరణం తర్వాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీకోసం పార్టీ పదవుల కోసం రచ్చ రచ్చ జరిగిపోయింది. ఈ క్రమంలోనే చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గం.. అనుకూలంగా ఈపీఎస్ వర్గం చీలిపోయాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాలు ఇటీవల చేతులు కలిపాయి. కలసి ఉంటే కలదు సుఖం అనుకుంటూ అధికారాన్ని పంచుకుని పంచెలు సవరించుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నమ్మకు ఉద్వాసన పలికేందుకు కూడా రెడీ అయ్యారు.,
అయితే, చిన్నమ్మ వర్గం ఊరుకుంటుందా? పరప్పన అగ్రహారం జైలు నుంచే తమ అధికారం కోసం పావులు కదిపింది. ఈ క్రమంలోనే చిన్నమ్మ వర్గం ముఖ్యనేత టీటీవీ దినకరన్.. ఎమ్మెల్యేలను స్వాగతించారు. దీంతో దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు తమకు ఎపీఎస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని పేర్కొంటూ ఏకంగా గవర్నర్ విద్యాసాగర్ రావ్ కి ఫిర్యాదు చేయడంతోపాటు ఓ నివేదికను సైతం ఇచ్చారు. మరోపక్క, మీడియా ముందుకు వచ్చిన దినకరన్,.. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
దీంతో మరోసారి తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరలేచిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఏం చేయాలో సూచించాలంటూ గవర్నర్ విద్యాసాగర్ రావ్.. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగి.. విషయంపై ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో గవర్నర్ ఢిల్లీ నుంచి చెన్నైకి వస్తున్నారు. దీంతో ఇక్కడ రాజకీయనేతలు చర్చోపచర్చల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప‌్రభుత్వం ఉంటుందా? ఊడుతుందా? వంటి విషయాలపై మేధావులు సైతంసందిగ్ధంలో పడిపోయారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.