త‌మిళుల‌ గ‌వ‌ర్న‌ర్ ఏం చేస్తున్నారో చూశారా?

Update: 2017-02-09 05:38 GMT
ఓ వైపు తమిళనాడులో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తుండగా, వాటిని ఓ కొలిక్కి తేగల అధికారం ఉన్న ఆ రాష్ట్ర ఇంచార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా పూర్తిస్థాయి బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ముంబైలోని ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 6వ స్నాతకోత్సవంలో విద్యాసాగ‌ర్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న  మాట్లాడుతూ "నేను తమిళనాడుకు ఇన్‌ చార్జి గవర్నర్‌ గా ఉన్నాను. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఇంట్లో మీరు టీవీ పెట్టగానే తమిళనాడు వార్తలు, చర్చలు వరుసగా వస్తుంటాయి. వాటిలో ఎవరో ఒకరు నిత్యం తమిళనాడు గవర్నర్ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. నేనేమో ఇక్కడ నోబెల్ బహుమతి గ్రహీతల మధ్య సంతోషంగా ఉన్నాను" అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఇద్దరు నోబెల్ గ్రహీతలకు ఆయన గౌరవ డాక్టరేట్ ఇన్ సైన్స్ ప్రదానం చేశారు.

ఇదిలాఉండ‌గా...రెండు రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ గవర్నర్ విద్యాసాగర్‌ రావు గురువారం చెన్నై రానున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర రాజ్‌ భవన్ చేసిన అధికార ప్రకటనతో అందరి దృష్టీ గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే కేంద్రీకృతమయ్యింది. గవర్నర్ తమకు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అపాయింట్‌ మెంట్ ఇచ్చారని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మహాబలిపురంలో ఆయనను తాము కలువనున్నామని పేర్కొంటున్నారు. తాను కూడా గవర్నర్‌ ను కలుస్తానని పన్నీర్‌సెల్వం ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంకోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News