త్వరలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను ముందే నిర్వహించాలని ఆయా రాష్ట్రాల ఎంపీలు కోరుతున్నారు. దీంతో కేంద్రం ఆలోచనలో పడింది. ఇప్పటికే సుమారు 100మంది ఎంపీలు ప్రధానికి విజ్ఙప్తి చేశారట... దీంతో పార్లమెంటు సమావేశాలను ముందుకు జరపాలా వద్దా అని ప్రభుత్వం మీమాంసలో పడింది.
తమిళనాడు - కేరళ - పశ్చిమబెంగాల్ - అసోం - పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ లోగా ఎన్నికలు రానున్నాయి. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఆయా రాష్ట్రాల ఎంపీలు వచ్చే అవకాశం తక్కువ. ఈ ఐదు రాష్ట్రాల నుంచి మొత్తం 115 మంది ఎంపీలున్నారు. వివిధ పార్టీలకు చెందిన వీరు తమతమ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం, వ్యూహరచనల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. దీంతో వారు పార్లమెంటుపై దృష్టి పెట్టే అవకాశం తక్కువ. అందుకే ఆ సమయంలో బడ్జెట్ సమావేశాలు వద్దంటూ వారు ప్రధానిని కోరారు. దీంతో వచ్చే గురువారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయించాలని కేంద్రం అనుకుంటోంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో మొదలై 29న బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది కూడా. కానీ, ముందుకు జరపాలని ఎంపీలు కోరుతుండడంతో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.