చిత్తూరు జిల్లాలో ఆ మంత్రి మాట వినని అధికారులు?

Update: 2019-10-29 14:30 GMT
చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి - ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మాటను ఆ జిల్లా ప్రభుత్వాధికారులు పెద్దగా ఖాతరు చేయడం లేదనే టాక్ వినిపిస్తూ ఉంది. అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు నారాయణ స్వామి. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులకు తన కేబినెట్లో స్థానం కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారిలో నారాయణ స్వామికీ స్థానం ఇచ్చారు. ఇక ఆ హోదా ఉన్నప్పటికీ మంత్రిగారి మాటను అధికారులు పెద్దగా వినడం లేదట!

అధికారులు మంత్రి మాట వినడం అనేది రకరకాల సమీకరణాలకు సంబంధించిన అంశం అయిపోయింది ప్రస్తుత రాజకీయాల్లో. అలాంటి సమీకరణాల్లో భాగంగా ఈ మంత్రి కమ్ ఉపముఖ్యమంత్రిని అధికారులు ఖాతరు చేయనట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రి హోదాలో ఉన్న నారాయణ స్వామి కన్నా అధికారులు  మంత్రి హోదా లేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - భూమన కరుణాకర్ రెడ్డిల విషయంలో మాత్రం సాగిలా పడిపోతున్నారని టాక్. వారు మంత్రులు కాకపోయినప్పటికీ.. వారి మాటకు చాలా విలువే దక్కుతోందట చిత్తూరు జిల్లాలో. మంత్రి కన్నా మంత్రులు కాని వారికే అక్కడ రాజకీయంగా ఎక్కువ విలువ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా అధికారులు కూడా వారికి జీ హుజూర్ అంటున్నారట!

ఈ మేరకు చిత్తూరు రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా  మారింది. అధికారుల తీరుపై ఈ టాక్ నడుస్తూ ఉంది.

Tags:    

Similar News