ఏ మాత్రం పరిచయం లేని వారికి సైతం ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కంట తడి పెట్టేలా చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాలు తెలంగాణలోని చాలా మందికి తెలీని పరిస్థితి. ఇలాంటి వేళలోనూ.. తనకేమాత్రం తెలీని గౌతమ్ రెడ్డి మరణానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కోట్లాది మంది కదిలిపోయారు. అయ్యో.. ఎంత కష్టం వచ్చిందని విలవిలలాడారు. ఇక.. ఏపీ ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. నెల్లూరు జిల్లా ప్రజల శోకానికి అంతు లేకుండా పోయింది.
అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఎవరితో అయినా ఇట్టే కలిసి పోవటం.. కష్టం వచ్చిందని సాయం కోసం వెళ్లిన వారికి సాయం చేసి కాని పంపని గౌతమ్ రెడ్డి శాశ్వితంగా తిరిగిరారన్న నిజాన్ని జీర్నించుకోలేకపోతున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తండ్రి ఆకస్మిక మరణం గురించి సమాచారం అందుకున్నంతనే బయలుదేరిన అతడు.. మంగళవారం రాత్రి 11 గంటలకు నెల్లూరులోని మంత్రి క్యాంప్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు.
చెట్టంత తండ్రి నిర్జీవంగా ఫ్రీజర్ లో ఉండిపోవటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తన తండ్రి భౌతికదేహంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటకు వెళ్లాలని కోరారు. తన తండ్రి ఛాతీ దగ్గర సున్నితంగా నిమురుతూ రోదించిన వైనం అందరి కంటి వెంట కన్నీరు కార్చేలా చేసింది. ఈ ఉదయం (బుధవారం) గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు నుంచి ఉదయగిరి బయలుదేరారు. ఆయన అంతిమయాత్రలో పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు పాల్గొన్నారు. ఆయన అంత్యక్రియలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.