జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి గ్రంధి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్‌పై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వరుసగా విడాకులు తీసుకుంటూ ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని తెలిపారు. రాజకీయాలకు సిద్ధాంతాలు, విలువలే ప్రాతిపదిక అని గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్... ఆపై టీడీపీతో కలిసినా, ఆ పార్టీ నుంచి కూడా విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ పై గెలిచింది గ్రంధి శ్రీనివాసే. అయితే , మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు టార్గెట్ చేసుకొని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం తో జనసేన అభిమానులు ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే , ఈ ఎమ్మెల్యే తనపై విమర్శలు చేసిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టే రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై ఏ విదంగా రియాక్ట్ అవుతారో చూడాలి.