లాక్ డౌన్ ఎఫెక్ట్ :పెళ్లింట్లోనే 30 రోజులుగా..తిండి పెట్టలేక పెళ్ళివారి తంటాలు !
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. అయితే , ఈ లాక్ డౌన్ ఎన్నెన్ని తిప్పలు తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చి 22 వ తేదీ నుంచి ఇంకా ఇప్పటివరకు కూడా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నది. మార్చి 22 వ తేదీన జనతా కర్ఫ్యూ విధించారు. ఈ జనతా కర్ఫ్యూ తరువాత దేశంలో మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించారు.
జనతా కర్ఫ్యూ విధించిన రోజున రైళ్లు, విమానాలు కూడా ఆగిపోయాయి. దీంతో ప్రయాణాలు చేయాలనుకున్న వారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత ఒకరోజు వ్యవధిలోనే లాక్ డౌన్ ను విధించడంతో ప్రయాణాలు చేసి వేరే ప్రాంతంలో చిక్కుకున్న వ్యక్తులు బయటకు రాలేక గత నెలరోజులుగా అవస్థలు పడుతున్నారు.
కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 50 మంది వ్యక్తులు బంధువుల పెళ్ళి కోసమని మహారాష్ట్ర వెళ్లారు. వీరంతా పెళ్లి చూసుకొని మార్చి 22 న తిరిగి మళ్లీ ఇంటికి బయలుదేరి రావాల్సి ఉన్నది. అయితే, మార్చి 22 న లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితి. పెళ్ళికి వెళ్లిన 50 మంది ఇప్పుడు అక్కడ తిప్పలు పడుతున్నారు. ఈ 50 మందిని విడిదింట్లోను, ఇటు పెళ్లి వారింట్లోనూ ఉంచారు. ఇంతమందిని రోజు పోషించాలంటే ఎవరికైనా కూడా మాములు విషయం కాదు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పెళ్ళికి వెళ్లిన వ్యక్తులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. 30 రోజులుగా బందీ అయ్యామని, ఇప్పటికైనా తమ స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని మొత్తుకుంటున్నారు.