అగ్ర‌రాజ్యంలో మ‌ళ్లీ అదే ద‌రిద్రం

Update: 2017-05-02 06:07 GMT
పేరుకు అగ్రరాజ్య‌మే అయినా.. అక్క‌డ నానా ద‌రిద్రాలు క‌నిపిస్తాయి. మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. సాటి మ‌నిషిని మ‌ర్యాద‌గా చూసే క‌నీస మాన‌వ‌త్వం అక్క‌డ త‌క్కువే. న‌లుపు.. తెలుపు ఫీలింగ్స్ చాలా త‌క్కువ‌. రంగు పిచ్చితో ఉండే ఆగ్ర‌రాజ్య జీవుల‌కు ట్రంప్ లాంటి వ్య‌క్తి దేశాధ్య‌క్షుడు కావ‌టంతో మూర్ఖులకు ఇష్టారాజ్యంగా మారింది.

గ‌తంలో విద్వేషాన్ని చాటుమాటుగా ప్ర‌ద‌ర్శించే అగ్ర‌రాజ్య జీవులు కొంద‌రు.. ఇప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చెల‌రేగిపోతున్నారు. అమెరికాలో తెల్ల‌తోలు అమెరిక‌న్లు మాత్ర‌మే ఉండాల‌న్న‌ట్లుగా వారి వినిపించే పిడి వాద‌నను వినిపిస్తున్నారు. ఇలాంటి వాటిని కొంద‌రు అమెరిక‌న్లు వ్య‌తిరేకిస్తున్నా.. మ‌రికొంద‌రు మాత్రం కామ్ గా ఉంటున్నారు. అదే స‌మ‌యంలో.. ట్రంప్ స‌ర్కారు సైతం విద్వేష దాడుల విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. విద్వేషాన్ని న‌రాన న‌రాన నింపుకున్న కొంద‌రు అతివాదుల పుణ్య‌మా అని అమెరికాలో త‌ర‌చూ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రొక‌టి చోటు చేసుకుంది.

భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు శాన్ డియోగోలో బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుపుతుండ‌గా కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతి చెంద‌గా.. ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. హ‌టాత్తుగా వ‌చ్చిన దుండగుడు పార్టీ చేసుకుంటున్న వారిపై కాల్పులు జ‌రిపారు. దీంతో ఒక్క‌సారిగా షాక్ తిన్న అక్క‌డి వారు.. అత‌డి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దాడి స‌మాచారాన్ని అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని దుండ‌గుడిపై కాల్పులు జ‌రిపారు. పోలీసుల కాల్పుల్లో అత‌డు మ‌ర‌ణించాడు. ఇంత‌కీ.. పార్టీ చేసుకున్న వారిపై ఎందుకు కాల్పులు జ‌రిపాడ‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. విద్వేషంతోనే ఈ దాడి జ‌రిగి ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌.. కాల్పుల్లో గాయ‌ప‌డిన వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News