పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ఇప్పటికే దేశంలో ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ... కొందరు మాత్రం ముందస్తు ఏర్పాట్లతో ఎప్పట్లా ధూంధాంగా పెళ్లి చేసుకుంటున్నారు. నోట్ల రద్దుతో చాలామంది శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నా ఆ జంట మాత్రం మరింత వేడుకగా జరుపుకొంది. హర్యాణాలోని గుర్ గావ్ లో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. ఆర్భాటంగా చేసే పెళ్లిళ్లపై ఐటీ శాఖ కన్నేస్తున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా పెళ్లి కూతురి కోసం హెలికాప్టరును పంపించిన వరుడి డేరింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
వినోద్ వాట్స్ (25) అనే ఆ పెళ్లి కొడుకు తాను తాళి కట్టబోయే లలితను తన ఇంటికి తీసుకువచ్చేందుకు ఏకంగా హెలికాప్టరు పంపించాడు. అధికారులతో మాట్లాడి ముందే ఏర్పాట్లు చేసిన వినోద్... హెలికాప్టరు ఎగిరేందుకు - ల్యాండ్ అయ్యేందుకు వీలుగా అన్ని అనుమతులు తీసుకొని తనకు కాబోయే శ్రీమతిని తన ఇంటికి తెచ్చాడు.
వధువు గ్రామమైన బాద్షాపూర్ నుంచి ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ హెలికాఫ్టర్ బయలేదేరి వెళ్లింది. గురుగావ్ లోని దుందేహేరా ప్రాంతానికి చెందిన వినోద్ తండ్రి బాబులాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. తన కుమారుడి వివాహవేడుకని వినూత్నంగా నిర్వహించాలని అనుకున్నానని అందుకే ఈ వధువుని ఈ విధంగా తీసుకొచ్చామని ఆయన చెప్పాడు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంచి పనిచేసిందని వరుడు వినోద్ అన్నాడు. ఈ హెలికాప్టరును ఉపయోగించడానికి తాము దానికి అద్దెగా రూ.2 లక్షల చెక్కును వినోద్ చెబుతున్నాడు. అయితే.... గుర్ గావ్, ఢిల్లీ శివార్లలోని ఇతర ప్రాంతాల్లో ఇలా పెళ్లిళ్లలో హెలికాప్టర్ వాడడం చాలాకాలంగా ఫ్యాషన్ గా, స్టేటస్ సింబల్ గా మారింది. అయితే.. నల్లధనంపై ఐటీ నజర్ పెరగడంతో కొంత తగ్గినా వినోద్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/