రాజకీయ నేతలకు భక్తి ఎక్కువైతే ఎంతటి ఉపద్రవాలొస్తాయో ఇప్పుడు కర్ణాటకలోని ఆలయాల నిర్వాహకులు - పోలీసులకు అర్థమవుతోందట.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఉన్న ఫలంగా వారంలో ఓ ఆలయాన్ని సందర్శిస్తుండడంతో అక్కడి అధికారులు - ఆలయ నిర్వాహకులు కంగారుపడుతున్నారు. అసలే ఆలయాలకు అరకొర నిధులు ఉంటే ముఖ్యమంత్రి రాకతో ఎలా ఏర్పాట్లు చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట..
తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి హరదనహళ్లిలోని ఈశ్వరాలయాన్ని సందర్శించారు. హసన్ జిల్లాలోని హోలెనరసిపుర తాలూకాలో మరో నాలుగు ఆలయాలను దర్శించుకున్నారు. మైసూరులోని ఆడిచుంచనగిరి మఠంతో పాటు మరో ఆరు మఠాలను సందర్శించారు. ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆలయాలను సందర్శించి రికార్డ్ సృష్టించారు.
కుమారస్వామి మే 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. గడిచిన 82 రోజుల పదవీ కాలంలో ఏకంగా 40 ఆలయాలను సందర్శించారట.. అంటే సరాసరిన రెండు రోజులకు ఓసారి ఆలయానికి వెళ్లినట్టు లెక్క.. కుమారస్వామి తండ్రి దేవెగౌడకు జోతిష్యంపై మక్కువ ఎక్కువ. ఇక సీఎం కుమారస్వామికి దైవ భక్తి ఎక్కువ. ఇలా భక్తి పారవశ్యంలో తండ్రి కొడుకులూ ఒకరిని మించి ఒకరు ఉన్నారని కన్నడ నాట సెటైర్లు వేస్తున్నారు.