అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలను సాకారం చేసుకోవటానికి హెచ్1బీ వీసా అవసరం. దాంతో మాత్రమే అమెరికాలో జాబ్ చేయటానికి అడుగు పెట్టే పరిస్థితి. ఇటీవల కాలంలో అమెరికాకు ఉద్యోగం కోసం వచ్చే వారి విషయంలో పలు ఆంక్షలు పెడుతున్న ఆగ్రరాజ్యం.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనల్ని తెర మీదకు తీసుకొస్తోంది. తాజాగా అలాంటి రూల్ ఒకటి తీసుకొచ్చింది.
ఇప్పుడున్న నిబంధనలకు అదనంగా హెచ్1బీ వీసా విషయంలో ఉద్యోగంలో చేరే నాటికి 90 రోజులు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. హెచ్1బీ వీసాలతో ఎక్కువగా లబ్థి పొందుతున్న దేశాల్లో భారత్.. చైనాలే ఉన్నాయి.
గణాంకాల ప్రకారం అమెరికాలో ఈ వీసా మీద పని చేస్తున్న 6.50 లక్షల మంది ఉద్యోగుల్లో అత్యధికులు మనోళ్లు.. చైనీయులే ఎక్కువ. కొత్త రూల్ ప్రకారం ఉద్యోగంలో చేరేందుకు కనీసం 90 రోజుల ముందు వీసాను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్ కారణంగా వెంటనే ఉద్యోగంలో చేరాల్సిన వారికి అవకాశం ఉండదు. ఈ కొత్త నిబంధనతో తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
హెచ్1బీ వీసా మీద అమెరికాలో పని చేయటానికి వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. నిరుత్సాహపరిచేలా తాజా మార్పు ఉందంటున్నారు. హెచ్1బీ వీసాతో వచ్చే వారి కారణంగా అమెరికన్ల ఉద్యోగవకాశాలు భారీగా ప్రభావితమవుతున్నాయని.. అందుకే అమెరికా ఈ తరహా నిర్ణయం తీసుకుందన్న మాట వినిపిస్తోంది.