టీఆరెస్ వల్లే ఐఎస్ ఉగ్రవాదం

Update: 2016-01-06 09:02 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత హన్స్‌ రాజ్‌ గంగారామ్‌ అహిర్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస ప్రభుత్వం వల్లే హైదరాబాదులో ఐసిస్ ఉగ్రవాదం ఉందని మండిపడ్డారు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్లనే యువత ఉగ్రవాదం వైపు చూస్తున్నారని విమర్శించారు. దేశమంతా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ ను పూజిస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం మాత్రం నిజాంను పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు.

నల్లకుంటలో బిజెపి కార్యాలయం ప్రారంభం నల్లకుంటలో ఏర్పాటు చేసిన బిజెపి ఎన్నికల కార్యాలయాన్ని కేంద్ర సహాయమంత్రి హన్స్‌ రాజ్‌ గంగారామ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌ లో ఎక్కడ చూసినా చెత్త - చెదారం దర్శనమిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన రెండు పడక గదుల ఇళ్లు ప్లెక్సీల పైనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి టీఆరెస్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇక్కడి బీజేపీలో ఊపు తెచ్చాయి. బీజేపీ స్తానిక నేతలు టీఆరెస్ ను ఏమీ అనలేని పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పదునైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కరంగా మారింది.

Tags:    

Similar News