సినీ హీరో - టీడీపీ సీనియర్ నేత - మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) ఈ రోజు తెల్లవారుఝామున అకాలమరణం చెందిన సంగతి తెలిసిందే. టీడీపీలో సీనియర్ నేతగా వ్యవహరించిన హరికృష్ణ....పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు హరికృష్ణ దూరంగా ఉంటున్నారు. అయితే, ఎన్టీఆర్ తనయుడిగా ప్రజల్లో హరికృష్ణకు విపరీతమైన ఆదరణ ఉందనడానికి హిందూపురంలో ఆయన గెలుపే నిదర్శనం. తన తండ్రి మృతి తర్వాత హిందూపురం నుంచి పోటీ చేసిన హరికృష్ణ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణపై హరికృష్ణ 62 వేల భార మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.
1996కు ముందు ఎన్టీఆర్....హిందూపురం నుంచి 3 సార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన తర్వాత హరికృష్ణ ...హిందుపురం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 62వేల భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పటి వరకు హిందూపురంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే హరికృష్ణే కావడం విశేషం. ఆ తర్వాత ఆ స్థాయిలో మెజార్టీ ఎవరికీ రాలేదు. హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో నియోజకవర్గ సమస్యలపై వెంటనే స్పందించేవారని అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. హరికృష్ణ మృతి విషయం తెలిసి హిందూపురం ప్రజలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 2014లో హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేసి గెలిచినా...ఈ స్థాయి మెజారిటీ రాకపోవడం విశేషం.