సిద్ధిపేట విద్యార్థుల‌కు హ‌రీశ్ ఛాలెంజ్‌!

Update: 2019-01-23 07:34 GMT
అధికార టీఆర్ ఎస్ పార్టీలో హ‌రీశ్ రావు భ‌విత‌వ్యంపై ప్ర‌స్తుతం రాజ‌కీయ విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న మేన‌ల్లుడు హ‌రీశ్ ను దూరం పెడుతున్నార‌ని.. కేటీఆర్ సీఎం అయ్యేందుకు లైన్ క్లియ‌ర్ చేస్తున్నార‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నారు. ఈ ద‌ఫా కేబినెట్ లో ఆయ‌న‌కు స్థానం ల‌భించ‌ద‌ని కూడా చెప్తున్నారు. హ‌రీశ్ రావు మాత్రం ఈ విశ్లేష‌ణ‌లు - ఊహాగానాల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా త‌న‌దైన శైలిలో ముందుకెళ్తున్నారు.

ఎన్నిక‌ల అనంత‌రం కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న ఆయ‌న తిరిగి జ‌నం బాట ప‌ట్టారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటు.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. తాజాగా హ‌రీశ్ రావు సిద్ధిపేటలోని ఓ ప్ర‌భుత్వ బాలిక‌ల ఉన్న‌త‌ పాఠ‌శాల‌లో రూ.10 ల‌క్ష‌ల‌తో నిర్మించ త‌ల‌పెట్టిన వంట‌గ‌దికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినుల‌తో ముచ్చ‌టించారు.

విద్యార్థినుల‌తో మ‌మేక‌మైన హ‌రీశ్.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వారికి ఓ ఛాలెంజ్ విసిరారు. వ‌చ్చే ప‌రీక్ష‌ల్లో 1010 గ్రేడ్ పాయింట్లు సాధించే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రికి రూ.25 వేల చొప్పున న‌జ‌రానా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థులంద‌రికీ త‌న ఛాలెంజ్ వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. బాగా చ‌ద‌వి త‌న నుంచి న‌జ‌రానా స్వీక‌రించాల‌ని విద్యార్థుల‌ను ప్రోత్స‌హించారు.

హ‌రీశ్ రావు ప్ర‌క‌ట‌న‌తో సిద్ధిపేట ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న విద్యార్థుల‌ను ప్రోత్స‌హిస్తున్న తీరు ఇత‌ర నాయ‌కుల‌కూ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని వారు చెబుతున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ‌రీశ్ రావు ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Full View
Tags:    

Similar News