తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ వ్యాఖ్యలు ఎంత చురుకుపుట్టేలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి మాటకారే అయినప్పటికీ.. హరీశ్ మాటల్లో ఆవేశం స్పష్టంగా కనిపిస్తుంది. తాను మాట్లాడే అంశం మీద పూర్తిస్థాయి పట్టుతో మాట్లాడే హరీశ్.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తనదైన శైలిలో బలమైన వాదనను వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అయిన టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణ సర్కారుపై విమర్శలు చేయటం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎవరిని అడిగి నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించిన ఆయన మాటలకు హరీశ్ కౌంటర్ ఇచ్చేందుకు రెఢీ అయ్యారు. బాబు వైఖరిని తీవ్రస్థాయిలో తప్పు పట్టిన హరీశ్.. చంద్రబాబుకు ఇంతకాలం రెండు కళ్ల సిద్ధాంతమే అనుకున్నామే కానీ.. ఆయన శరీరమే రెండు భాగాలుగా ఉందంటూ మండిపడ్డారు.
రెండు నాలుకలు.. రెండు తలకాలయలు.. రెండు నోళ్లు.. రెండు శరీరాలతో చంద్రబాబు ఉన్నారని.. ఆయన మాటలు చూస్తుంటే.. బాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా? అన్నది అర్థం కావటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఎవరిని అడిగి చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారని.. తమ ప్రాజెక్టుల గురించి అడిగే హక్కు ఆయనకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు.