తమ దృష్టికి వచ్చే సమస్యల్ని పరిష్కరించేందుకే ప్రజాప్రతినిధులకు సమయం దొరకదు. అలాంటిది సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ మెసేజ్ లకు స్పందించే నేతలు ఉంటారా? అన్న డౌట్ చాలామందికి కలుగుతుంది. మారిన పరిస్థితుల్లో కొంతమంది నేతలు.. ఇలాంటి వాటికి వాయువేగంతో స్పందిస్తున్నారు. కేంద్రంలో ఇలాంటి వైఖరిని కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు.. సుష్మా స్వరాజ్ లలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక.. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులు ముందుంటారు.
సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే.. విపరీతమైన ఫాలో అప్ తో దాని సంగతి చూసే గుణం ఉన్న హరీశ్ కు.. వాట్సప్ లో మెసేజ్ వస్తే చాలు.. క్షణాల్లో స్పందిస్తారని చెబుతారు. ఈ మాటలకు తగ్గట్లే తాజాగా ఆయన ఒక ఉదంతంలో ఆయన వేగంగా స్పందించారు. ఇటీవల భారీగా వర్షాలు కురిసినప్పటికీ తమ గ్రామంలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. చెరువులు నిండక రైతులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారంటూ కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ కు చెందిన ఒక రైతు కుమారుడు పెట్టిన వాట్సప్ సందేశానికి మంత్రి హరీశ్ రియాక్ట్ అయ్యారు. అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
వెంటనే గ్రామాన్ని సందర్శించిన అధికారులు చెరువుల్ని పరిశీలించారు. ఆ వివరాల్ని హరీశ్ దృష్టికి తీసుకెళ్లటం.. వెంటనే గ్రామంలోని పెద్ద చెరువును నింపే అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అధికారుల పరిశీలన తర్వాత ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా వెళ్తున్న నీటితో కానీ.. వరద కాలువతో కానీ గ్రామంలోని చెరువులు నింపేందుకు ఉన్న అవకాశాల్ని తెలుసుకొని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఇంత వేగంగా స్పందించి.. అధికారుల చేత పరుగులు తీయించి పనులు పూర్తి చేసే హరీశ్ తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/