హత్రాస్ బాధిత కుటుంబానికి 60 మందితో పహారా .. !

Update: 2020-10-09 16:30 GMT
హత్రాస్ హత్యాచారం బాధిత కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని వార్తలు వెలువడ్డాయి. దీనితో ఆ కుంటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబరు 8లోగా నివేదిక అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనితో యూపీ పోలీసులు భూల్గరీ గ్రామంలోని బాధిత కుటుంబం ఇంటి దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇంటి ప్రాంగణంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే 60 మంది పోలీసులతో నిత్యం పహరా ఏర్పాటు చేశారు. అలాగే అంతేకాదు డిఐజి అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమించింది. అవసరమైతే బాధితురాలి ఇంటి దగ్గర కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.

కుటుంబ సభ్యుల అంగీకారం తరువాత కెమెరాల ఏర్పాటు జరిగిందని హత్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా తెలిపారు. వారిని పరామర్శించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసేందుకు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఊర్లో ఉండాలంటే భయంగా ఉంది. నిందలు భరించలేక పోతున్నాం అని తెలిపారు. మా గురించి, మా కూతురు గురించి ప్రచారమవుతున్న వదంతులు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చంపుతామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. కష్టపడి పనిచేయడం మాత్రమే మాకు తెలుసు. ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుతాం అని చెప్తున్నారు.


Tags:    

Similar News