కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో ప్రారంభమైపోయిందా అనే అనుమానం అందరిలో మెదులుతుంది. కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు దేనికి నిదర్శనం. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. పొరుగు రాష్ట్రాల్నించి ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యం లో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేరళలో మరోసారి కరోనా కేసులు ఎక్కువగా రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో చుట్టుపక్కల రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. కేరళలో శనివారం ఒక్కరోజే 20,624 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజుల్లో కేరళలో మొత్తం లక్ష మందికి పైగా ప్రజలు కరోనా బారినపడడం పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కేరళలో కరోనా విజృంభణను జాగ్రత్తగా గమనిస్తూ... ఎప్పటికప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పరంపరలో ఈ నెల 5 నుంచి తమ రాష్ట్రానికి కేరళ నుంచి వచ్చే ప్రజలకు ఆర్ టీపీసీఆర్ నివేదిక తప్పని సరి చేస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటన చేశారు.
కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు కర్ణాటక అప్రమత్తమైంది. కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ చేయించుకున్నవారికి నెగెటివ్ రిపోర్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ రాష్ట్రానికి రావాలంటే..72 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్టు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. టీకా రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరని కర్ణాటక ముఖ్య మంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పండుగలు, ఇతర కార్యక్రమాల ప్రయాణాలపై నిషేధం విధించాలని నిపుణులు సలహా ఇచ్చారు. అలాగే కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని , కొత్త రకం డెల్టా వైరస్ కూడా తీవ్రమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ పూర్తి కాకుండానే మూడో వేవ్ వస్తే ... అప్పుడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉండవచ్చని జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు.