ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపైకి వచ్చి వైసీపీ తరుఫున పోటీచేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా.. దగ్గుమాటి మాత్రం తృటిలో ఓడిపోయారు. గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అయ్యిండేవారనే చర్చ ఆదిలోనే సాగింది.
ప్రస్తుతం పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా దగ్గుబాటి ఉన్నారు. ఎన్నికల ముందు వరకూ ఇన్ చార్జిగా రామనాథం బాబు ఉండేవారు. దగ్గుబాటికి వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే తిరిగి వైసీపీలో చేరారు. దీంతో అప్పటి నుంచి దగ్గుబాటికి, తిరిగి చేరిన రామనాథం బాబుకు అస్సలు పడడం లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
ఓటమి బాధతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలకు కూడా దగ్గుబాటి హాజరు కాలేదు. దీంతో ఇప్పుడు పర్చూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా రామనాథంబాబు మారిపోయారు. ఆయన కూడా పార్టీ శ్రేణులకు అవసరమైన పనులను అధిష్టానంతో మాట్లాడి చేసిపెడుతున్నారు. ఇక తాజాగా ఎంపీడీవోలను, ఎస్సైలను సమీక్షకు పిలిచిన రామనాథబాబుకు చుక్కెదురైంది. అధికారులు రాకపోవడం అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో దగ్గుబాటి మళ్లీ లైన్లోకి వచ్చారు.
తాజాగా హైదరాబాద్ లో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పర్చూరు ఇన్ చార్జి అయిన దగ్గుబాటి, ఆయన కుమారు హితేష్ చెంచురామ్ కలిశారు. తనకు ప్రత్యామ్మాయంగా నియోజకవర్గంలో అధికారం చెలాయిస్తున్న రామనాథంబాబు పై ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇన్ చార్జి మీరేనని.. రామనాథం బాబు కేవలం మీకింద పనులు చేస్తాడని బాలినేని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయితే మంత్రి బాలినేని తాజా వివాదంలో దగ్గుబాటికే సపోర్టు చేయడం రామనాథబాబు వర్గానికి కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.ఇప్పుడు వైసీపీలో దగ్గుబాటి వర్సెస్ రామనాథం బాబు ఎపిసోడ్ పర్చూరులో సెగలు పుట్టిస్తోంది.