కుప్పం ఈ సీటు ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా ఉంది. కుప్పం అన్నది తమిళనాడు బోర్డర్ లో ఉంటుంది. ఆ సీటు అన్నది ఏపీలో ఉంది అన్నది ఎవరికీ తెలియకుండా ఏడు ఎన్నికలను చంద్రబాబు గెలుచుకుని వచ్చారు. నిజానికి రాజకీయ అధినేతలు పోటీ చేసే సీటు విషయంలో మరో పార్టీ అధినేతలు దృష్టి పెట్టరు. అది ఒక రాసుకోని ఒప్పందంగా ఉంటూ వస్తోంది.
అయితే జగన్ సీఎం అయ్యాక కుప్పం అంటున్నారు. చంద్రబాబుని ఓడిస్తాను అని సవాల్ చేస్తున్నారు. అంతే కాదు ఆయన ఈ మధ్య కుప్పం వెళ్ళి వచ్చారు. అరవై వేల కోట్ల పధకాలను ప్రారంభించారు. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ కి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కుప్పం ని నిరంతరం పర్యవేక్షించేలా చూస్తున్నారు.
ఇవన్నీ తెలిసిన వార్తలే. అయితే కుప్పం విషయంలో ఆ మధ్య మరో వార్త ప్రచారంలోకి వచ్చింది తెలుగువాడు అయినా తమిళ హీరోగానే పాపులర్ అయిన విశాల్ కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దానికి సంబంధించి కొన్నాళ్ళ పాటు న్యూస్ వైరల్ అయింది. అయితే ఆ తరువాత అదేమీ లేదని కూడా మరికొన్ని వార్తలు వచ్చాయి.
అయితే ఇపుడు మళ్లీ ఆ వార్తలు ప్రాణం పోసుకుంటున్నాయి. అంతే కాదు కుప్పం నుంచి కచ్చితంగా విశాల్ పోటీ చేస్తారు అనేలా రాజకీయ పరిణామాలు చకచకా సాగుతున్నాయి. తన కొత్త సినిమా లాఠీ ప్రమోషన్ మీద తిరుపతి వచ్చిన విశాల్ జగన్ తో భేటీ కాబోతున్నారు. జగన్ తో భేటీ అంటే అది కర్టెసీ కాల్ అని ఎంత అనుకున్నా అందులో కచ్చితంగా రాజకీయాలు ఉంటాయి.
అందునా చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తాను అని శపధం చేస్తున్న జగన్ కుప్పం మూలాలు ఉన్న తమిళ తెలుగు స్టార్ హీరోను ఊరికే పిలవరు కదా. ఇక విశాల్ కి కుప్పంలో వీధి వీధిలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడ వారు గతంలో గ్రానైట్ వ్యాపారం చేసేవారు. అలా కుప్పంతో లింక్ ఉంది. కుప్పంలో అత్యధికులు తమిళ వాసనలతో ఉంటారు. పైగా హీరో ఇమేజ్ తో విశాల్ ఉన్నారు.
జగన్ అంటే తనకు ఇష్టమని కూడా విశాల్ చెబుతున్నారు. జగన్ లాంటి లీడర్ ని తాను చూడలేదని అంటున్నారు. 3,800 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడం జగన్ వల్లే సాధ్యమని విశాల్ అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ తో విశాల్ భేటీ మామూలు సంచలనం కానే కాదు. ప్రత్యేకించి జగన్ తో కలవడం అంటే దీని వెనక అర్ధాలు పరమార్ధాలు చాలానే ఉంటాయని అంటున్నారు.
ఈ భేటీ ఎందుకో ఏమిటో తెలియకపోయినా తరువాత రోజులలో జరిగే పరిణామాలు బట్టి అన్నీ తెలుస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా కుప్పంలో విశాల్ పోటీ చేస్తే చంద్రబాబు మీద గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే గెలుపు కోసం టీడీపీ చమటలు కార్చాల్సిందే. వైసీపీకి కూడా అదే కావాలి.
బాబుని కుప్పంలో కట్టడి చేస్తే ఏపీ అంతా తాము దున్నేయవచ్చు అన్నది వారి ప్లాన్. అందుకోసం వారికి విశాల్ కావాలి. ఆయనతో ఈ విషయంలో చాలా అవసరం ఉంది. మరి రాజకీయాల పట్ల విశాల్ కి అసక్తి ఉంది. దాంతో ఆయన ఇపుడు కాదు అని చెబుతున్నా కాదంటే అవును అనే రాజకీయాలలో విశాల్ కూడా సడెన్ షాకులు ఇస్తారాని అంటున్నారు.
విశాల్ మాత్రం ఆయన అంటే ఇష్టం అందుకే కలుస్తున్నాను తప్ప ఎటువంటు రాజకీయాలు లేవు. నేను కుప్పం నుంచి పోటీ చెయ్యడం లేదు వైస్సార్సీపీ లోను జాయిన్ అవ్వడం లేదు ఇవి ఎవరో పుట్టించిన వార్తలు గతం లో కూడా ఇదే చెప్పను మల్లి ఇదే చెబుతున్నాను అని విశాల్ అన్నారు . విశాల్ ఆలా చెప్పిన కూడా జగన్ ని కలుస్తుండటం తో విశాల్ మీద కుప్పం మీద వార్తలు వస్తూనే ఉన్నాయ్. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.