హెటిరో కొవిఫర్ ఇంజక్షన్ ధర ఎంత? ఎక్కడ దొరుకుతుందంటే?

Update: 2020-06-22 04:15 GMT
మాయదారి రోగం రాకుండా వ్యాక్సిన్ రాకున్నా.. ఆ దరిద్రపుగొట్టు జబ్బు అంటుకున్న వేళ..త్వరగా కోలుకునేందుకు మొన్న ట్యాబ్లెట్ల రూపంలో మందు వస్తే.. తాజాగా ఇంజక్షన్ ఫార్మాట్ బయటకు వచ్చింది. యాంటీ వైరల్ తరగతికి చెందిన రెమ్ డెసివిర్ ను అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ తయారు చేస్తోంది. దీనికి జనరిక్ ఫార్మాట్ లో హెటిరో ల్యాబ్స్ తో పాటు.. సిప్లా లిమిటెడ్ తయారు చేసేందుకు అనుమతులు రావటం తెలిసిందే.

ఈ వివరాలన్ని ఇప్పటికే వచ్చినా.. దీని ధర ఎంత ఉంటుందన్న విషయం మీద క్లారిటీ రాలేదు. తాజాగా ఈ ఇంజక్షన్ ధర మీద కాస్త స్పష్టత వచ్చినట్లే. ఈ ఇంజక్షన్ ధర రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఇంజక్షన్ ను ఏ మందుల షాపు వద్దకు పడితే అక్కడకు వెళ్లి అడిగితే ఇవ్వరు. షాపుల్లో లభించదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అందుబాటులోకి తీసుకొస్తారు.

హెటిరో సంస్థ కొవిఫర్ బ్రాండ్ మీద సిద్ధం చేస్తే.. మరో ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా సంస్థ సిప్రెమి బ్రాండ్ మీద మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ ఇంజెక్షన్ ను పాజిటివ్ గా తేలిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. పౌడర్ రూపంలో ఉండే ఈ ఇంజెక్షన్ ఐవీ ఫ్లూయిడ్ ద్వారా సెలైన్ లోకి ఎక్కిస్తారు.

ఈ ఇంజక్షన్ ను ఆసుపత్రుల్లో మాత్రమే వినియోగించాలే తప్పించి.. ఎవరికి వారు సొంతంగా వాడకూడదు. అత్యవసర అనుమతికి మాత్రమే ఈ మందును వాడాల్సి ఉంటుంది. మహమ్మారిని కంట్రోల్ చేయటానికి హెటిరో సంస్థ తీసుకొచ్చిన ఈ ఇంజక్షన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన అధికారిక పత్రాలు కంపెనీకి అందజేశారు. దీంతో.. ఇది రోగులకు ఉపయోగించేందుకు వీలవుతుంది.
Tags:    

Similar News