సీఆర్డీఏ రద్దు పై జగన్ సర్కార్ కి ఎదురుదెబ్బ ..ఏమైందంటే ?

Update: 2020-01-22 07:58 GMT
సీఆర్డీఏ రద్దుపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఆర్డీఏ రద్దు చట్టం పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనీ పిటిషనర్ కోరారు. అయితే ఈ పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం తో పాటు,ఏపీ ప్రభుత్వాన్ని ప్రతి వాదులు గా చేర్చారు. విజయవాడ కు చెందిన వ్యాపారి శీలం మురళీధర్‌ రెడ్డి పిల్‌లో కోరారు.

ఈ బిల్ అమరావతి రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షను ఉల్లంఘించేదిలా ప్రకటించాలని, రాజధాని పరిధిలో నిర్మాణ పనులు ఆపేయడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించాలని పిల్‌ లో మురళి కోరారు. ఒకవేళ రాజధాని ఆగిపోతే, భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు, పేదల హక్కులు హరించినట్లు అవుతుందని పిల్‌ లో తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం తో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.అమరావతి ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని.. భారీగా నిధులు ఖర్చు చేశారని తెలిపారు. రాజధాని నిర్మాణం పై గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. మళ్లీ కొత్త ప్రభుత్వం దీన్ని కొనసాగించాలని.. ఆపేందుకు వీలు లేదన్నారు.

ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. అలాగే ఆమోదం కూడా తెలిపారు. ఈ బిల్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉంది. ఈ తరుణంలో దీనిపై హై కోర్ట్ లో ఫీల్ వేయడంతో దీనిపై కోర్టు ఏంచెప్తుందో అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక పోతే , మరో వైపు అమరావతి రైతులు ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. నేడు (బుధవారం) ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టనుంది. అమరావతినే ఏపీ రాజధాని గా కొనసాగించాలని 37 మంది రైతులు కోర్టును తెలిపారు.
Tags:    

Similar News