సచివాలయం కూల్చివేత..కేసీఆర్ కు హైకోర్టు షాక్

Update: 2019-10-01 11:21 GMT
తెలంగాణలో ఇప్పుడున్న సచివాలయం కూల్చివేసి అద్భుతమైన కొత్త సచివాలయం కట్టడానికి సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్న వేళ ఆయనకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మంగళవారం సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్లపై చర్చించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ కేసు విషయమై పూర్తి వాదనలు వింటామని..  అప్పటి వరకు సచివాలయ భవనాన్ని కూల్చివేయవద్దని హైకోర్టు తెలంగాణ సర్కారుకు ఆదేశించింది.

అయితే ఇప్పటికే సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని.. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.  ఇది ప్రభుత్వ నిర్ణయమైనందుకు ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే హైకోర్టులో సచివాలయం కూల్చివేతపై లంచ్ మోషన్ పిటీషన్ ను అత్యవసరంగా హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.  దీనిపై దసరా సెలవుల వరకూ సచివాలయం కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది.

దసరా సెలవుల తర్వాత ఈ కేసు విషయమై పూర్తి వాదనలు వింటామని.. ఈ సమయంలో భవనాల కూల్చివేతపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. దసరా సెలవుల్లో కూల్చడం మంచిది కాదని.. పిటీషన్ విచారించాక కూల్చడంపై తేలుస్తామని స్పష్టం చేసింది.
Tags:    

Similar News