పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి లైన్ క్లియర్ అయ్యింది. రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇన్నాళ్లు హైకోర్టులో కేసు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి భూమిని బదిలీ చేయలేదు. ఇప్పుడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్రం బైసన్ పోలో గ్రౌండ్ ను బదలాయించనుంది.
హైకోర్టు నిర్ణయంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త సెక్రెటేరియట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు చెప్పవచ్చు. బైసన్ పోలో గ్రౌండ్ లో వాస్తు ప్రకారం తెలంగాణ కొత్త సచివాలయం నిర్మించాలని కేసీఆర్ యోచించారు. ఇప్పుడున్న సచివాలయం ఏమాత్రం బాగాలేదని అందులోకి వెళ్లడం లేదు కేసీఆర్. హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణకు ఇవ్వాలని పలుమార్లు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రులను కోరారు. అయితే కేంద్రం ఇవ్వడానికి రెడీ కాగా బైసన్ పోలో చుట్టుపక్కల ఉన్న స్థానికులు, కొందరు ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. క్రీడాకారులు, పిల్లలకు ఆటస్థలంగా ఉన్న బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణం చేపట్టవద్దని హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో చాలా రోజులుగా హైకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు హైకోర్టు ఫిర్యాదు దారుల వాదనను తోసిపుచ్చి తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పీరియడ్ లోనే కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు.