పేకాట మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత అసహనం చూపిస్తారో అందరికి తెలిసిందే. పేకాట పేరుతో ‘‘13 ముక్కలాట’’ మీద కన్నెర్ర చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రికి ఉన్న అగ్రహం నేపథ్యంలో.. క్లబ్లుల్లో ఆడే పదమూడు ముక్కలాట మీద తెలంగాణ పోలీసులు జోక్యం చేసుకోవటం.. హెచ్చరించటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు క్లబ్బుల యజమానులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. పదమూడు ముక్కలాట అన్నది ఆట నైపుణ్యానికి సంబంధించిందే తప్పించి.. జూదక్రీడలోకి రాదన్న విషయాన్ని వారు న్యాయస్థానానికి విన్నవించారు.
దీనిపై విచారించిన హైకోర్టు..వివిధ క్లబ్బుల అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించింది. క్లబ్బుల్లో రమ్మీ ఆడుతుంటే పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. కాకుంటే.. క్లబ్బుల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని.. వాటిన ఆయా క్లబ్బుల పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ కు అనుసంధానించేలా ఉండాలని.. వాటిని పోలీసులు పర్యవేక్షించాలని పేర్కొంది. క్లబ్బుల దగ్గర 15 రోజులకు సంబంధించిన సీసీ కెమేరాల ఫుటేజ్ భద్రం చేయాలని ఆదేశించింది.
తాజా ఆదేశాల నేపథ్యంలో క్లబ్బుల్లో జరిగే రమ్మీ ఆటపై పోలీసుల జోక్యం పూర్తిగా తగ్గిపోనుంది. అయితే.. క్లబ్బుల్లో కానీ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతుంటే మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. క్లబ్బుల్లో 13 ముక్కలాట ఒక్కటి ఆడుతుంటే మాత్రం తెలంగాణలో పోలీసులు జోక్యం చేసుకునే ఛాన్స్ లేదంతే.