కాంగ్రెస్ కు తెలంగాణ హైకోర్టులు ఝలక్..ఏమవుతుందో!

Update: 2019-04-30 11:42 GMT
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లెజిస్ట్లేటివ్ పార్టీని విలీనం చేస్తున్నారన్న వ్యవహారంలో కోర్టుకు ఎక్కిన కాంగ్రెస్ పార్టీకి చిన్నఝలక్ తగిలింది. ఈ విషయంలో తమ పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించాలని కాంగ్రెస్ కోరగా దానికి తెలంగాణ హై కోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది.

అయితే పిటిషన్ ను విచారణకు అయితే తీసుకుంది. దానిపై విచారణ జరపబోతున్నట్టుగా తెలంగాణ హై కోర్టు ప్రకటించింది. తదుపరి విచారణను ఏకంగా జూన్ పదకొండుకు వాయిదా వేసింది న్యాయస్థానం. తమ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కాంగ్రెస్ కోరగా.. కోర్టు దానిపై విచారణను  ఏకంగా దాదాపు నెల తర్వాతి సమయానికి వాయిదా వేయడం విశేషం!

అంటే తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్ట్లేటివ్ పార్టీలోకి తెలంగాణ సీఎల్పీని విలీనం వ్యవహారంపై తదుపరి కోర్టు విచారణ చేపట్టేది జూన్ రెండో వారంలో అని స్పష్టం అవుతోంది.

ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి ఝలక్కే అని చెప్పవచ్చు. ఆ పిటిషన్ పై విచారించబోతున్నట్టుగా, ఆ వ్యవహారంపై చర్యలు తీసుకోబోతున్నట్టుగా హై కోర్టు ప్రకటించింది కానీ.. విచారణను మాత్రం చాలా దూరానికే వాయిదా వేసింది. దీంతో కాంగ్రెస్ కోరుకుంటున్నట్టుగా తక్షణ చర్యలు ఉండవని స్పష్టం అవుతూ ఉంది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. విచారణ అయితే జూన్ రెండో వారానికి వాయిదా పడింది. అంత వరకూ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో రాజకీయ పరమైన ఆందోళన మాత్రమే చేయగలేదేమో!
Tags:    

Similar News