విభజన కారణంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఎంతకూ ఒక కొలిక్కి రాని పలు పంచాయితీల్లో విద్యుత్తు ఉద్యోగుల వ్యవహారం ఒకటి. ఏపీ మూలాలు ఉన్నాయని పేర్కొంటూ.. 1200 మంది విద్యుత్తు ఉద్యోగుల్ని ఒక్క కలంపోటుతో తెలంగాణ సర్కారు రిలీవ్ చేయటం తెలిసిందే.
దీనిపై ఇప్పటికే ఎన్నో మార్గాల్లో ప్రయత్నించినా సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా హైకోర్టు ఈ విషయంలో తాత్కలికంగా కొద్దిపాటి సర్దుబాటును చేసిందని చెప్పాలి. 1200 విద్యుత్తు ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు.. రిలీవ్ చేసిన ఉద్యోగులు తెలంగాణ క్యాడర్ కు చెందిన వారే అవుతారని తేల్చింది.
అయితే.. వారికి ఇవ్వాల్సిన జీతాల విషయంలో ఏపీకి 58 శాతం.. తెలంగాణకు 42 శాతం ఇవ్వాలని పేర్కొంటూ.. నాలుగు వారాల్లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన బకాయిల్ని చెల్లించాలని పేర్కొంది. మూడు నెలల కిందట హటాత్తుగా విద్యుత్తు ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తూ.. తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవటం ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు మొదలు.. కేంద్ర సర్కారు వరకూ చాలా చోట్లకు వెళ్లినా ఒక పరిష్కారం లభించలేదు.
తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో.. తీవ్ర మానసిక వేదనతో ఉన్న 1200 మంది విద్యుత్తు ఉద్యోగుల వేదన కొంతమేరకు తీరుతుందని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి ఇచ్చిన ఈ తీర్పుతో పంచాయితీ ఒక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు. ఇక.. ఉద్యోగులు ఎవరికి చెందుతారన్న అంశంపై విష్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది.