ఔట్ లుక్ పై మేం చెప్పినాకే చర్యలు

Update: 2015-09-10 06:47 GMT
వ్యంగ్య కథనంతో కోర్టు చిక్కులు ఎదుర్కొంటూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆగ్రహాన్ని చవిచూస్తున్న ప్రముఖ మీడియా సంస్థ ఔట్ లుక్ కు కాస్తంత ఊరట లభించింది.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇచ్చిన కంప్లైట్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

తన పరువుకు భంగం వాటిల్లేలా ఔట్ లుక్ కథనం ప్రచురించిందని స్మితా సబర్వాల్ ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వాదనలు తాజాగా ముగిశాయి. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఔట్ లుక్ కథనాన్ని ప్రచురించిందని స్మిత ఆరోపించగా.. ఆమె ఆరోపణలు సరి కాదంటూ ఔట్ లుక్ వాదిస్తోంది. ఇరు పక్షాల వాదనల్ని విన్న న్యాయమూర్తి తుది తీర్పును రిజర్వ్ చేశారు.

తీర్పు ఇచ్చేంత వరకూ ఔట్ లుక్ పత్రిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. వారి ప్రతినిధులను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలన్నింటిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఒక విధంగా తాజా చర్యలన్నీ ఔట్ లుక్ కు కాస్తంత ఉరటనిచ్చే పరిణామంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News