ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలని కల్పించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు సచివాలయాల పేరిట లక్షకు పైనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు లక్షల్లో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా...సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు వివిధ కేటగిరీలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల రాత పరీక్షలు సెప్టెంబర్ 7న జరగనున్నాయి.
అయితే ఈ పరీక్షలని 9 జిల్లాలో నిలిపేవేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం - తూర్పు - పశ్చిమ గోదావరి - కృష్ణా - ప్రకాశం - కడప - కర్నూలు జిల్లాల్లో ఈ పరీక్షలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం. తాజాగా కడప జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సైట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. తమను రెగ్యులర్ చేసే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.
ఇక వారి పిటిషన్ ని విచారించిన హైకోర్టు రెండు వారాల్లోపు పరిష్కరించి - వాటి నియామకాల కోసం నిర్వహిస్తున్న రాత పరీక్షలను నిలిపేయాలని ఆదేశించింది. ఇక కడప జిల్లా తర్వాత మిగతా జిల్లాల్లోను ఇదే తరహా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. సర్వేయర్ల పోస్టులకు సంబంధించి కూడా వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది.
హైకోర్టు ఆదేశాలతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పాటు ఇంజనీరింగ్ విభాగం అధికారులు లీగల్ విభాగం అధికారులతో చర్చిస్తున్నారు. ఎలా అయిన వచ్చే నెల 7న ఈ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లి సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కుదిరితే వీళ్ళు సెప్టెంబర్3న డివిజన్ బెంచ్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే డివిజన బెంచ్ తీర్పు అనుకూలంగా వస్తే పరీక్షలు జరుగుతాయి. లేకుంటే ఆ 9 జిల్లాల్లో పరీక్షలు ఆగిపోయే అవకాశం ఉంది.