సుదీర్ఘకాలం తర్వాత కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన తొలి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. పార్లమెంటులోకి తన ఎంట్రీతోనే భిన్నంగా వచ్చిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. బ్రిటీష్ పద్దతికి భిన్నంగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాల్ని కట్టుకొచ్చిన ఆమె.. అన్నింటిలోనూ కొత్త విధానాల్ని ప్రవేశ పెట్టనున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
కేంద్ర ఆర్థికమంత్రి హోదాలో తమ కుమార్తె చేసే ప్రసంగాన్ని వినేందుకు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంటుకు వచ్చారు. కుమార్తె ప్రసంగాన్ని వారు ప్రత్యక్షంగా విన్నారు. దాదాపుగా రెండు గంటల పాటు సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..
+ నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు. వచ్చే దశాబ్ద కాలానికి లక్ష్యాలను అందుకుంటాం. పది లక్ష్యాలతో ఈ దశాబ్దానికి లక్ష్యాలను నిర్ణయించుకున్నాం. ఈ అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం. ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది.
+ మౌలిక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావాల్సి ఉంది. ఆశ.. విశ్వాసం.. ఆకాంక్షల ప్రాతిపదికన గత ఐదేళ్లలో అదనంగా ఒక ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించాం. ప్రత్యక్ష పన్నులు - రిజిస్ట్రేషన్ లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యంతో స్వచ్ఛ భారత్ నిర్మితమైంది. మేకిన్ ఇండియాతో దేశంలో తయారీ పరిశ్రమ వేగమందుకుంది. అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. గత ఐదేళ్లలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు మార్పులు తీసుకువచ్చాం.
+ ప్రధానమంత్రి సడక్ యోజన.. ఉడాన్.. పారిశ్రామిక కారిడార్.. రవాణా.. రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం. సాగర మాలతో అనుసంధానం జరుగుతోంది. ఉడాన్ పథకంతో చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కలిగింది. భారతమాల - సాగర్ మాల - ఉడాన్ పథకాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి.
+ మెట్రో రైలు సర్వీసులు పెరుగుతున్నాయి. మరో 300కి.మీ. మేర మెట్రో మార్గానికి అనుమతులిచ్చాం. ఇప్పటివరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉంది.దేశంలో జలమార్గంలో రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రైల్వేల్లో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం.
+ ఒకే దేశం.. ఒకే గ్రిడ్ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం. గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
+ మినిమమ్ గవర్నమెంట్ - మ్యాగ్జిమమ్ గవర్నన్స్ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం. బస్ ఛార్జీలు - పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన చేస్తున్నాం. తయారీ - మరమ్మతు - నిర్వహణ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తాం.
+ ఎఫ్‌డీఐల ఆకర్షణకు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచంతో పోలిస్తే, భారత్‌కు ఎఫ్‌డీఐలు మెరుగ్గా ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం. రెడ్ టేపిజం నియంత్రణకు చర్యలు.
+ ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం. ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ కోసం ప్రత్యేక లాబీయింగ్. ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్ పథకం తీసుకువస్తాం. దాదాపు 3కోట్ల దుకాణ యజమానులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే, వార్షిక టర్నోవర్ రూ.1.5కోట్ల కన్నా తక్కువ ఉండాలి.
+ ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు - మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ. మీడియా - యానిమేషన్ - విమానయాన రంగంలో ఎఫ్ డీఐలపై పరిశీలన. స్టాక్ మార్కెట్ లో ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు వెసులుబాటు.వాటిని విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ.
+ వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.1 -రూ.2 - రూ.5 - రూ.10 - రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం! చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి. పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తాం. కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400కోట్లకు పెంపు. దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
+ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం. ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయి.కఠిన చట్టాలతో దాదాపు 4లక్షల కోట్ల మొండి బకాయిల వసూలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధన సాయం. ఆన్ లైన్ పర్సనల్ లోన్స్ - మీ ఇంటి ముందుకే బ్యాంకు సేవలు రానున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78శాతం పెరిగాయి. 2018లో పన్ను వసూళ్లు రూ.11.37లక్షల కోట్లు.
+ దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు. 17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు. ప్రత్యేకించి ఆదివాసీలకు సంబంధించిన నృత్య - కళా - సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్ చేయనున్నాం. ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ. వీటి వాడకం వల్ల రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా. ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్.
+ గ్రామీణ భారత ప్రగతిలో మహిళ పాత్ర కీలకం. అన్ని చోట్లా మహిళా నాయకత్వం పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 78మంది మహిళలు ఎన్నికల్లో విజయం సాధించారు. మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు. జన్‌ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.
+ ప్రపంచంలో టాప్-200 విద్యా సంస్థల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలకు మరిన్ని నిధులు. స్టడీ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకునే అవకాశం. పరిశోధనలకు ప్రాధాన్యం. జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం. జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు. బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం.
+ గ్రామాలు - పేదరికం - రైతులే మన గ్రామీణ భారతం. అందుకే గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్ - గ్యాస్ సరఫరా. పెట్టుబడులు లేకుండా చేసే వ్యవసాయం (జీరో బడ్జెట్ వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే అనేకమంది రైతులకు శిక్షణ ఇచ్చాం. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు రైతులకు ధన్యవాదాలు. రైతులు దిగుమతుల భారం తగ్గించారు. మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన.
+ అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్ భారత్ గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక ఇదే. 81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథక కింద నిర్మించాం. డిజిటల్ అంతరాలను తొలగించే డిజిటల్ లిటరసీ కార్యక్రమం. నగరాలు - పట్టణాలు - గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నాం. స్వచ్ఛభారత్ అభిమాన్ పథకం విజయవంతమైంది. 9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించాం.
+ ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నాం. పీపీపీల పరంగా అమెరికా - చైనాల తర్వాత భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా ఉంది. స్టాండప్ ఇండియా పథకం ప్రకారం వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ.
వాతలు
- డీజిల్ - పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు.
- బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు.
- 5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
- బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి. రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్.
వరాలు
+ మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.
+ పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం. పాన్ లేదా ఆధార్ నంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు
+ విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలిస్తోంది.
+ స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు. ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం.
+ భారత పాస్ పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
+ స్టార్టప్ ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగింత.
+ ఖేల్ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.
+ ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
+ 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్ - గ్యాస్ సరఫరా.
+ అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించాం.