వారి ప్రేమకు విలన్ గా.. ‘హిందూ మహాసభ’ ?

Update: 2016-11-30 06:48 GMT
ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమకు అయితే అబ్బాయి తరఫు వారి కారణంగా కానీ.. అమ్మాయి తరఫు వారి కారణంగా కానీ బ్రేకులు పడే వీలుంది. వారి ప్రేమకు విలన్ గా మారే వీలుంది. కానీ.. తాజా ఇష్యూలోమాత్రం వారిద్దరికి.. వారి కుటుంబాలకు ఏ మాత్రం సంబంధం లేని ఒక సంస్థ విలన్ గా మారిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

సివిల్స్ లో ఫస్ట్ ర్యాంకర్ టీనాదబీకి.. సెండర్ ర్యాంకర్ అత్తర్ ఉల్ షఫీఖాన్ కు మధ్య లవ్ ఎపిసోడ్ తెలిసిందే. ప్రేమకు ఏమీ అడ్డు రావన్న విషయాన్ని ప్రూవ్ చేస్తూ వారి మధ్య తొలిచూపులోనే ప్రేమ పుట్టటం.. అదిప్పుడు పెళ్లి వరకూ వెళ్లటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగటం తెలిసిందే. ఇద్దరు టాప్ సివిల్ ర్యాంకర్ల మధ్య ప్రేమ.. పెళ్లి పెద్ద విషయం కాకున్నా.. అమ్మాయి హిందువు కావటం అబ్బాయి ముస్లిం కావటంతో మరింత ఆసక్తి పెరిగింది.

తాజాగా ఇప్పుడు అదే ఇష్యూ వివాదంగా మారింది. ఎందుకంటే.. వీరి ప్రేమ విషయంలో పానకంలో పుడకలా హిందూ మహాసభ ఎంటర్ అయ్యింది. ఇది లవ్ జిహాదీ అని చెబుతూ హిందూమహాసభ.. అమ్మాయి తల్లిదండ్రులకు ఏకంగా లేఖ రాయటం సంచలనంగా మారింది. ఈ పెళ్లిపై పునరాలోచించుకోవాలని కోరుతూ సభ జాతీయ కార్యదర్శి మున్నాకుమార్.. టీనా తండ్రి శర్మకు లేఖ రాశారు.

దేశం మొత్తాన్ని ఇస్లామీకరణ చేసే ఉద్దేశంతో లవ్ జిహాదీ కార్యక్రమాన్ని చేపట్టారని.. అత్తర్ ఖాన్ ఇంటి నుంచి టీనా తిరిగి సొంతింటికి రావటాన్నిఘర్ వాపసీ కోసం తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని సదరు సంస్థ లేఖ రాయటమే కాదు.. దానికి సంబంధించినకాపీని తన వెబ్ సైట్ లో ఉంచటం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరి లవ్ ఎపిసోడ్ లో హిందూ మహాసభ జోక్యం చేసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. మరీ.. లవ్ ఎపిసోడ్ ఎక్కడికి వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News