విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాలు, తటస్థ వ్యక్తులు జగన్ నిర్ణయింపై దుమ్మెత్తిపోస్తున్నారు. స్వయంగా జగన్ పార్టీలోనే ఉన్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ తన పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 75 పథకాలకు వైఎస్సార్, జగన్ పేర్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇన్ని పేర్లున్నా జగన్‌కు కుతి తీరలేదా అని నిలదీస్తున్నారు. గత ప్రభుత్వాల పథకాల పేర్లు కూడా మార్చేసి తన తండ్రి, తన పేర్లు జగన్ పెట్టుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. జగన్‌కు ఉన్నటువంటి ప్రచార కండూతీ ఎవరికీ లేదని నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. ఈ మేరకు బాలయ్య సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు... బాలయ్య పోస్టు ఇలా ఉంది....
మార్చెయ్యటానికీ, తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…….
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్..
శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..
అంటూ బాలయ్య తీవ్ర పదజాలంతో జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును తీసేసి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలై అభివృద్ధి చెందిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టింది. దాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు.
ఇదే విషయాన్ని బాలయ్య తన తాజా పోస్టులో పేర్కొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు ముఖ్యమంత్రి అయ్యి విమానాశ్రయం పేరు మార్చాడని మండిపడ్డారు. ఇప్పుడు కొడుకు జగన్ యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని ధ్వజమెత్తారు. మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు. ఓ సంస్కృతి.. నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్ భావోద్వేగంతో పోస్టు చేశారు.
అంతేకాకుండా ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో పదవుల్లోకి వచ్చిన నాటి నేతలు ఇప్పుడు వేరే పార్టీలో ఉండి విశ్వాసం లేని కుక్కల్లా ఉన్నారని పరోక్షంగా మంత్రి రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులపై బాలకృష్ణ మండిపడ్డారు. వీరంతా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చినవారే కావడం గమనార్హం. టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది కూడా వీరే కావడం గమనార్హం. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో వచ్చిన వీరు విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారని.. వీరిని చూసి కుక్కలు కూడా వెక్కిరిస్తున్నాయి బాలయ్య తన పోస్టులో నిప్పులు చెరిగారు. కుక్కల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఆయా నేతల వ్యవహారశైలిని బాలయ్య కడిగిపారేశారు.
పేర్లు మారుస్తున్న జగన్‌ను మార్చడానికి ప్రజలున్నారు జాగ్రత్త.. పంచభూతాలున్నాయ్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.