అమ్మో! అంత పెద్ద భూకంపం వస్తుందా?

Update: 2016-01-06 07:08 GMT
భారత్ కు పెను భూకంపం ముప్పు ఉందని హోంమంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర - ఈశాన్య భారత్ లో స్కేలుపై 8 అంతకంటే ఎక్కవ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నాయిని శాఖలోని విపత్తు నిర్వహణ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దేశంలోని హిమాలయ ప్రాంతం పెను భూకంపం ముప్పు అంచున ఉంది. మణిపూర్ లో మొన్న సంభవించిన భూకంపం భవిష్యత్ లో ఈ ప్రాంతంలో మరింత తీవ్రతతో పెను భూకంపం సంభవిస్తుందనడానికి సూచనగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇటీవల వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా హిమాలయ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలోని టెక్టోనిక్ ప్లేట్ల స్థితిగతులు మరోసారి మారిపోయాయని, గత భూకంపాల వల్ల ఈ ప్రాంతంలోని భూమి అంతర్భాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్లలో పగుళ్లు సంభవించాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఎన్డిఎమ్) ఒక నివేదికలో పేర్కొంది. ఈ పగుళ్ల కారణంగా భారత్ కు మరీ ముఖ్యంగా పర్వత ప్రాంతాలలో పెను భూకంప ముప్పు పొంచి ఉందని ఆ నివేదిక వివరించింది. నేపాల్ - భూటాన్ - మయన్మార్ - భారత్ లలో పెను భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎన్డిఎమ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలోని రాష్ట్రాలకు ఈ ముప్పు అధికంగా ఉందని వివరించారు. కొలరడో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ - ప్రముఖ సెస్మాలజిస్ట్ అయిన రోజర్ బిల్హామ్ కథకం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి రిక్టర్ స్కేలుపై 8 అంత కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం నాలుగు భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది.
Tags:    

Similar News