నిన్నటి వరకూ పరిమిత సమూహానికి మాత్రమే పరిచయం అయిన సుందర్ పిచ్చయ్ పేరు రాత్రికి రాత్రే సుపరిచితమైంది. ఇప్పటివరకూ ఆయన తెలివితేటలు.. కార్యదీక్షత గూగుల్ తో పాటు.. ఆయా రంగ ప్రముఖులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఆయన్ను గూగుల్ సీఈవోగా ఎంపిక చేసిన నిర్ణయం బయటకు వచ్చిందో.. ఆయనో వెరీ.. వెరీ స్పెషల్ గా మారిపోయారు.
దేశ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని.. ఆయనకు అభినందనలు తెలిపిన వారున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. సుందర్ పిచ్చయ్ మాత్రం ప్రధాని మోడీ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన్ను కలుసుకోవాలని ఉందని చెప్పిన ఆయన.. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మోడీ తెలిపిన శుభాకాంక్షలకు స్పందించిన ఆయన.. మోడీని కలవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ లో అమెరికా పర్యటనకు వెళుతున్న ప్రదాని మోడీ.. ఈసారి సిలికాన్ వ్యాలీపై దృష్టి సారించటం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల్ని కలవనున్నారు. తాజా పరిస్థితులలో.. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ ను కలిసే అవకాశం ఉందంటున్నారు. ఎటూ పిచ్చయ్ కూడా మోడీని కలవాలని ఆరాటపడుతున్న నేపథ్యంలో.. ఆయన్ను కలుసుకోవటానికి మోడీకి అభ్యంతరం ఎందుకు ఉంటుంది..?