సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్ భారతీయ జనతా పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్నే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సమయం లో సీఏఏ పై మద్దతు కూడగట్టేందుకు, ప్రజల్లో నెలకొన్న అనుమానాల్ని తీర్చేందుకు బీజేపీ తనవంతు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ.. గతవారం ‘ఇండియా విత్ సీఏఏ' ప్రచారాన్ని ప్రారంభించారు. దీనికి కొనసాగింపుగా టోల్ ఫ్రీ నంబరుతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కి ఊహించని షాక్ తగులుతోంది.
సీఏఏను సమర్థించేవాళ్లు ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కేంద్రానికి తమ మద్దతు తెలియజేయొచ్చు అని పేర్కొంటూ 8866288662 అనే టోల్ ఫ్రీ నంబరును పార్టీ జాతీయ నాయకత్వం విడుదల చేసింది. అయితే, ఈ నంబరును అనేక రకాలుగా దుర్వినియోగం అవుతోంది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. సీఏఏకు మద్దతు ప్రచారం కోసమే కాకుండా ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే ఆరునెలల పాటు నెట్ ఫ్లిక్స్ ఉచితమని నెట్టింట ఓ ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా లో ఒకరు మొదలు పెట్టిన ఈ ప్రచారం వైరల్ అయింది. ఈ ఫ్రీ ఆఫర్ అందరికీ కాదని, మొదట మిస్డ్ కాల్ ఇచ్చిన 1,000 మందికి మాత్రమేనని అందులో ట్విస్టులు కూడా ఇచ్చారు.
ఇక, ఈ నంబరును కొందరు ఉద్యోగ నియామకాల కోసం వాడుకోగా మరికొందరు ఎస్కార్ట్ సర్వీసుల కోసం ఉపయోగిస్తున్నారు. ఓ వ్యక్తి 8866288662 నంబరుకు డయల్ చేయడం ద్వారా లైంగిక సంబంధాలకు సంబంధించిన సేవలు పొంద వచ్చని నెట్టింట పోస్ట్ చేశాడు. మరో వ్యక్తి ఉద్యోగాలు కావాలా? ఈ నెంబరును సంప్రదించడం ద్వారా మీకు కావాల్సిన కొలువు దొరుకుతుందని పేర్కొన్నారు. ఇంకో మహిళ పేరుతో ఉన్న అకౌంట్లో...తనకు బోర్ కొట్టింది కాబట్టి ఫోన్ నంబరు షేర్ చేస్తున్నానని...ఫాలోవర్లందరూ తనను అనుసరించవచ్చని ట్వీట్ చేసింది. దీంతో...సీఏఏ నంబరు కాస్త అవగాహన కంటే...ఇతరులు ఓ ఆట ఆడుకునేందుకే పనికి వస్తోందని సెటైర్లు పేలుతున్నాయి.