కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచంలోని మెజారిటీ దేశాలని అతలాకుతలం చేస్తుంది. ఈ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో చాలాదేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ కరోనా దెబ్బకి మన దేశం కూడా లాక్ డౌన్ లోకి వెళ్ళింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే .కరోనా ఇంకా కంట్రోల్ లోకి రాక పోవడంతో మరోసారి లాక్ డౌన్ ను పొడగించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగిస్తే ఏమౌతుంది? దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తనదైన శైలిలో స్పందించారు. కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తే భారత్ లో కరోనా వైరస్ మరణాల కన్నా ఆకలి చావులే ఎక్కువగా ఉంటాయని నారాయణ మూర్తి తెలిపారు. కరోనా వైరస్ ను అంగీకరించాలి తీరాల్సిందేనని, అయితే ఆరోగ్యంగా ఉన్న వారు మళ్లీ తిరిగి వారి వారి పనుల్లోకి వెళ్లాలని అభిప్రాయ పడ్డారు.
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గమనిస్తే.. మరణాల రేటు 0.25-0.5 శాతం మధ్యలో ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఇది తక్కువని వివరించారు. దేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని, దీనికి చాలా కారణాలు ఉన్నాయని మూర్తి తెలిపారు. ఈ మరణాల్లో పావు శాతం కాలుష్యం వల్ల చనిపోతున్నారని, సంవత్సరానికి 90 లక్షల మంది చనిపోతూ ఉంటే.. కరోనా వల్ల రెండు నెలల్లో 1,000 మంది మరణించడాన్ని చూస్తే.. దీన్ని బట్టి చూస్తే కరోనా వైరస్ వల్ల మనం అనుకున్నంత భయాందోళనలు లేవనే అంశం అర్థమౌతోందన్నారు. భాతర్ లో దాదాపు 19 కోట్ల మంది అసంఘటిత రంగంలో లేదా స్వయం ఉపాధి పొంతున్న వారు ఉన్నారని, లాక్ డౌన్ వల్ల వీరందరి పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని మూర్తి తెలిపారు. ఒకవేళ లాక్ డౌన్ కొనసాగితే వీరి జీవనోపాధి కోల్పోతారని హెచ్చరించారు.