హైదరాబాద్ పోలీసులు మహా గ్రేట్ గురూ.. తప్పిపోయిన కుక్కను పట్టిచ్చారు

Update: 2020-03-07 04:52 GMT
రోజుకు తక్కువలో తక్కువ ఐదుగురు మొదలు పది మంది మిస్ అవుతున్న చిత్రమైన పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో నెలకొంది. మిస్ అయిన తమవాళ్లను కనిపెట్టాల్సిందిగా తరచూ పోలీస్ స్టేషన్లను బాధితులు ఆశ్రయించటం... కొందరు పోలీసులు స్పందిస్తే... మరికొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితులకు మరింత బాధ కలిగేలా చేస్తుంటారు. మనుషులు మిస్ అయితేనే పట్టించుకోని పోలీసులు... పెంపుడు కుక్క మిస్ అయితే పట్టించుకుంటారా?

ఎవరైనా మంత్రి... ఎంపీ... ఎమ్మెల్యే ఇలా పవర్ ఉన్న పెద్ద మనిషికి చెందిన పెంపుడు జంతువుల్ని వెతికేందుకు తమ శక్తియుక్తుల్ని వినియోగిస్తారన్న అపప్రదను తొలగించే ప్రయత్నం చేయటమే కాదు... ఒక సామాన్యుడికి అంతులేని సంతోషాన్ని మిగిల్చారు హైదరాబాద్ పోలీసులు.

కుషాయగూడకు చెందిన ఒక వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క మిస్ అయ్యింది. తానెంతో ఇష్టంగా పెంచుకునే కోకో కుక్క మిస్ అయ్యిందని వెతికి పెట్టాల్సిందిగా కోరాడు. దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చాడు. తన ప్రయత్నం తాను చేశానే తప్పించి... పోలీసులు స్పందిస్తారన్న ఆశ పెద్దగా లేని అతగాడికి దిమ్మతిరిగే సర్ ప్రైజ్ ఇచ్చారు పోలీసులు. అతగాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత... తమ కుక్క ఫోటోను ఇచ్చిన వ్యక్తి ఆధారాన్ని పట్టుకొని బ్లూకోట్స్ ఆఫీసర్... క్రైమ్ టీం రంగంలో కి దిగి కేసును చేధించారు. వారం పాటు కష్టపడి... ఎంతో ప్రేమగా పెంచుకునే కోకోను వెతికి పట్టుకొని...దాని యజమానికి ఫోన్ చేసి అప్పగించిన వైనం చూస్తే... హైదరాబాద్ పోలీసులు ఏమైనా చేయగలరన్న ఫీల్ కలగటం ఖాయం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా... తాజా ఎపిసోడ్ లో మాత్రం వారిని అభినందించాల్సిందే.
Tags:    

Similar News