హైదరాబాద్ ఫంక్షన్ హాళ్లను రౌండప్ చేస్తున్న పోలీసులు.. ఎందుకంటే? హైదరాబాద్ మహానగరంలో ఫంక్షన్ హాళ్లకు కొదవ లేదు. ప్రతి వీధిలోనూ ఒకటో.. రెండో కనిపిస్తాయి. లెక్కకు మిక్కిలిగా ఉండే ఈ ఫంక్షన్ హాళ్లను రౌండప్ చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 31 లోపు మాత్రమే బుకింగ్స్ ను స్వీకరించాలని.. తర్వాత నుంచి వేడుకల్ని అనుమతించకూడదంటూ మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ఫేజ్ 2లోకి వెళ్లిందన్న సమాచారం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాపై కేంద్రం మార్గదర్శకాలు రూపొందించి.. వాటిని అమలు చేయాలని చెప్పిన దానికి రెండు రోజుల ముందే.. దాదాపు అలాంటి సలహాలు.. సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని అన్ని ఫంక్షన్ హాళ్లకు పోలీసులు వెళుతున్నారు.
ఫంక్షన్ హాళ్ల నిర్వాహకుల్ని కలుస్తున్న పోలీసులు.. మార్చి 31 తర్వాత హాళ్లను బుక్ చేసుకున్న వారి వివరాల్ని సేకరిస్తున్నారు. హాళ్లను బుక్ చేసుకున్న వారి చిరునామాలు.. ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చి 31 తర్వాత వేడుకల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వ సూచనల ప్రకారమే చేయాలన్న విషయం తో పాటు.. కరోనాపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆదివారం నుంచి మొదలైన ఈ డేటా సేకరణ సోమవారం నాటికి ఒక కొలిక్కి వచ్చిందని.. ఈ రోజు (మంగళవారం)తో మొత్తం సమాచారాన్ని సేకరించటంతో పాటు.. వారిని అప్రమత్త తో ఉండాలన్న హెచ్చరించనున్నారు. అంతేకాదు.. హాళ్లను బుక్ చేసిన తేదీలకు అనుగుణంగా.. ఆయా కుటుంబాల వారు నిర్వహించాల్సిన శుభకార్యాల్ని వాయిదా వేసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించే వారి మీద చర్యలు తప్పవన్న మాట వినిపిస్తోంది. సో.. శుభకార్యాలు ఏమైనా ఉంటే.. వాయిదా వేసుకోవటం చాలా మంచిది.