హైద‌రాబాద్ మ‌హిళ‌లు లావెక్కిపోతున్నార‌ట‌.. రీజ‌నేంటో?!

Update: 2022-09-09 16:30 GMT
నిత్యం ప‌నుల‌తో కుస్తీలు ప‌ట్టే హైద‌రాబాద్ మ‌హిళ‌లు  కూడా లావెక్కి పోతున్నార‌ట‌. తాజాగా వ‌చ్చిన ఒక స‌ర్వే.. ఈ సంచ‌ల‌న నిజాన్ని వెల్ల‌డించింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో లావెక్కిపోతున్న మ‌హిళ‌ల జాబితాలో హైద‌రాబాద్ మ‌హిళ‌లు రెండో స్థానంలో ఉన్నార‌ని.. స‌ర్వే పేర్కొంది. నిజానికి హైద‌రాబాద్‌లో ఉన్న మ‌హిళ‌ల్లో 75 శాతం మంది ఉద్యోగమో.. వ్యాపార‌మో..చేస్తూ.. నిత్యం బిజీగానే ఉంటున్నారు. అంతేకాదు.. కుటుంబాల‌కు చేదుడువాదోడుగా కూడా నిలుస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. వారు లావెక్కిపోతున్నార‌ని.. ఇది అనారోగ్యానికి దారితీస్తోంద‌ని స‌ర్వే హెచ్చ‌రించింది. ఎక్కువ‌గా కూర్చుని ప‌నిచేయ‌డం.. స‌మ‌య పాల‌న‌లేని ఆహార‌పు అల‌వాట్లు.. పోష‌క విలువ‌లులేని.. ప‌దార్థాలు తిన‌డం.. వంటివి ప్ర‌ధాన కార‌ణం అంటూనే.. సెక్స్‌కు దూరంగా ఉంటుండ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మని.

ఈ స‌ర్వే చెప్ప‌డం.. మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. హైద‌రాబాద్ స‌హా.. న‌గ‌రాల్లోని మ‌హిళ‌లు వారానికి ఒక‌సారి కూడా సెక్స్‌లో పాల్గొన‌డం లేద‌ని.. ఇది హార్మోన్ల‌పై ప్ర‌భావం చూపి.. ఊబ‌కాయానికి దారితీస్తోంద‌ని.. స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

సామాజిక అభివృద్ధి కేంద్రం (సీఎస్‌డీ) తాజాగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. జాతీయస్థాయిలో పురుషుల కన్నా మహిళల్లో సమస్య అధికంగా ఉంటే.. కర్ణాటక, తెలంగాణలో మాత్రం మహిళల కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది. మహిళల్లో ఊబకాయం/అత్యధిక బరువు సమస్య దక్షిణాదిలోనే ఎక్కువగా కన్యాకుమారి జిల్లాలో 53శాతం ఉంటే.. ఆ తరువాత స్థానంలో హైదరాబాద్‌ (51శాతం) ఉంది.

గిరిజన ప్రజలు, ఆదివాసీలు నివసించే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా 14శాతంతో దక్షిణాదిలోనే మెరుగైన స్థానంలో ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోని 120 జిల్లాల్లో 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో ఊబకాయ సమస్యపై అధ్యయనం చేసిన సీఎస్‌డీ 'దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళల్లో ఊబకాయం' నివేదికను రూపొందించింది.

ఆ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుజిత్‌ కుమార్‌ మిశ్రా సమక్షంలో ఈ నివేదికను తెలంగాణ మహిళాశిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్‌ విడుదల చేశారు. జాతీయ స్థాయిలో ఊబకాయ పెరుగుదల రేటు 3.3 శాతం నమోదైతే, తెలంగాణ మినహా దక్షిణాది రాష్ట్రా ల్లో ఎక్కువగా ఉంది. తమిళనాడులో 9.5 శాతం, కర్ణాటకలో 6.9, కేరళలో 5.7 శాతం ఉంటే... తెలంగాణలో మాత్రం అత్యల్పంగా 2 శాతమే నమోదైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News