‘‘శ్రీలంకతో సిరీస్ లో విరాట్ కోహ్లితో సమంగా సిరాజ్ రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను ఇద్దరికీ ఇచ్చి ఉండాల్సింది’’.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంస ఇది. ‘కొన్నేళ్లుగా సిరాజ్‌లో చాలా మార్పు వచ్చింది. రోజురోజుకీ రాటుదేలుతున్నాడు. బంతిని చక్కగా స్వింగ్ చేస్తున్నాడు. అతడి రనప్ లోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. కొత్త కొత్త చిట్కాలతో పవర్ ప్లేలో వికెట్లు తీస్తున్నాడు. జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.
పవర్ ప్లేలో వికెట్ల తీయలేకపోయే సమస్యను సిరాజ్ పోగొట్టాడు’’ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయమిది. ‘‘2/30, 3/30, 4/32.. ఇవీ గత మూడు మ్యాచ్ ల్లో అతడి గణాంకాలు. అన్నీ ప్రారంభంలో తీసిన వికెట్లే. ఇవే కాదు వీటికి ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లో జరిగిన గత ఐదు పరిమిత ఓవర్ల మ్యాచ్ ల్లో అతడు 12 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాపై రెండు టెస్టుల్లో ఆరు వికెట్లు తీశాడు.
ఈ గణాంకాలు చాలవా?
మూడు ఫార్మాట్లలో టీమిండియా ప్రధాన పేసర్ ఎవరంటే.. నిన్నటివరకు జస్ప్రీత్ బుమ్రా గురించే చెప్పేవారు. కానీ, అతడు గాయంతో ఆరు నెలలుగా మైదానంలోకి దిగలేదు. మరో పేసర్ మొహమ్మద్ షమీని టి20లు ఆడించింది తక్కువ. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టిన కుర్రాళ్లు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా ప్రధాన బౌలర్ ఎవరంటే.. కచ్చితంగా చెప్పే పేరు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్. అంతగా నిలకడగా రాణిస్తున్నాడు అతడు. కొన్నేళ్లుగా చూస్తుంటే సిరాజ్ బౌలింగ్ రాటుదేలుతోంది. పేస్ లో పదును కనిపిస్తోంది.
ఆరంభంలో వికెట్లు తీయాలంటే అతడే..
బుమ్రా టీమిండియా తరఫున చేసే మొదటి పని.. ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను మొదట్లోనో పెవిలియన్ కు పంపడం. ఇప్పుడా బాధ్యతను సిరాజ్ నెరవేరుస్తున్నాడు. ఏ మ్యాచ్లోనూ అతడు నిరాశపర్చడం లేదు. ఒకటికి రెండు వికెట్లు తీస్తూ ప్రత్యర్థి వెన్నువిరుస్తున్నాడీ హైదరాబాదీ. వాస్తవానికి నాలుగేళ్ల కిందట జట్టులోకి వచ్చినప్పటి సిరాజ్ వేరు.. ఇప్పుడు ఆడుతున్న సిరాజ్ వేరు. అతడి బౌలింగ్ ఆ స్థాయిలో మెరుగుపడింది. మొదట్లో వికెట్లు తీసినా, తీయకున్నా పరుగులు ఇవ్వడం అనేది సిరాజ్ బలహీనతగా మారేది. తాజాగా వికెట్లు తీయడమే కాదు.. ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. లంకతో జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ అతడు 30 పరుగులకు అటుఇటుగానే ఇచ్చాడంటే సిరాజ్ బౌలింగ్ ప్రతిభను అంచనా వేయొచ్చు.
హై హై హైదరాబాదీ
షమి వయసు 33 ఏళ్లు. బుమ్రాకు 28 ఏళ్లే అయినా గాయాల బెడద ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని ఆశించడం తప్ప ఒత్తిడి చేయలేం. మరో ప్రధాన పేసర్ ఉమేశ్ యాదవ్ కు పరిమిత ఓవర్ల క్రికెట్ లో చోటులేదు. అర్షదీప్, ఉమ్రాన్ కుర్రాళ్లే. దీపక్ చాహర్ దీ పరిమిత ఓవర్ల స్థాయే. మరి అన్ని ఫార్మాట్లలోనూ ఆడగల, సత్తా చాటగల దూకుడు ఉన్నది సిరాజ్ లోనే. అన్నిటికీ మించి గాయాల బెడద కూడా లేదు. మంచి లైన్ అండ్ లెంగ్త్, వికెట్ టు వికెట్ బౌలింగ్ తో సిరాజ్ చూపుతున్న నిలకడ టీమిండియాకు వరమే.
రోహిత్ ఇచ్చిన ప్రాధాన్యమే సాక్ష్యం
ఆదివారం నాటి శ్రీలంకతో మూడో వన్డేలో సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆ జట్టును కుప్పకూల్చాడు. అయితే, వన్డేల్లో ఐదో వికెట్ సాధించడం అనే ఘనతను సిరాజ్ ఇప్పటివరకు సాధించలేదు. 1988లో అంటే 35 ఏళ్ల కిందట అర్షద్ అయూబ్ తర్వాత మరే హైదరాబాదీ కూడా ఈ రికార్డును అందుకోలేదు. దీంతో నిన్నటి మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ మొత్తం ఫీల్డర్లను వికెట్ కు దగ్గరగా మోహరించాడు. సహచరుడు షమీ కూడా సిరాజ్ ఐదు వికెట్ల ఘనతను అందుకునేందుకు తన బౌలింగ్ లో కొంత రాజీపడ్డాడు.
కానీ, బ్యాడ్ లక్ తో సిరాజ్ కు ఐదో వికెట్ దక్కలేదు. అయితే మాత్రం.. సిరాజ్ కు జట్టు, ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో దీనిద్వారా తెలిసింది. సిరాజ్ గనుక ఇదే దూకుడు కొనసాగిస్తే ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచ కప్ లో మరింత పదును దేలిన ఆయుధం అవుతాడు. ఇక బుధవారం న్యూజిలాండ్ తో సొంతగడ్డ హైదరాబాద్ లో సిరాజ్ వన్డే ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు మంచి ప్రతిభ చూపుతాడని ఆశిద్దాం. గుడ్ లక్ హైదరాబాదీ సిరాజ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.