ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అవినీతి అధికారులకు వంత పాడుతోందని, అధికారులను కూడా తమ అవసరాలకు వినియోగించుకున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనికి మద్దతుగా టీడీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని పలు వీడియోలు, క్లిప్పింగ్ లు చూపిస్తూ విమర్శల ఘాటు పెంచుతున్నారు. అయితే పార్టీ విధానానికి వ్యతిరేకంగా తాను ముందుకు వెళ్తానని తెలిపారు.
దీంతో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇరకాటంలో పడ్డారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఏబీవీ సస్పెండ్ అంశంపై స్పందించారు. పరోక్షంగా తమకు ఏవీబీ సహకరించారని అంగీకరించారు. దీనిపై వైఎస్సార్సీపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అవినీతి అధికారులకు టీడీపీ అండగా నిలబడుతోందని ఆరోపించారు. దానికి అనుగుణంగా ఎంపీ నాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘మీరు ముఖ్యమంత్రి అవడానికి మీ పార్టీ అధికారంలోకి రావడానికి.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ’ అని ఆదివారం ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఏవీబీని వెనకేస్తూ చేసిన ఈ ట్వీట్ తో తీవ్ర విమర్శలు రావడం తో సోమవారం మరో ట్వీట్ చేశారు.
‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను భుజాల పైన ఎక్కించుకుని మోయటమే పార్టీ విధానం అయితే నేను ఖచ్చితంగా ఆ విధానానికి వ్యతిరేకమే’ అని ఎంపీ స్పష్టం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. అంటే తమ పార్టీ అవినీతి అధికారులను పార్టీ భుజాలపై మోస్తుందని పరోక్షంగా అంగీకరించారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా తాను వ్యవహరిస్తానని ఈ సందర్భంగా ఎంపీ నాని పేర్కొన్నారు. అంటే టీడీపీ అవినీతి అధికారులను భుజాల పై ఎక్కించుకుని మోస్తుందని చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది.