పులి కడుపున పులే పుడుతుంది ... విజయాన్ని తండ్రి కి అంకితమిచ్చిన సోరెన్ !
దేశ వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఈసారి విజయం ముఖం దాచేసింది. కాంగ్రెస్ - జేఎంఎం కూటమికి విజయం సాధించడంతో, బీజేపీ ప్రతిపక్ష హోదాతో సర్దుకుపోవాల్సిందే.ఈ ఫలితాలు వెలువడినప్పటి నుంచి హేమంత్ సొరెన్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాల సరళిపై జేఎంఎం లీడర్, కాబోయే సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎలాంటి ఆలోచనలు,పథకాలతో ముందుకెళ్లబోతున్నారని అడగ్గా .. హేమంత్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి హోదా చేపట్టి.. ముందు ఇది చేస్తా.. అది చేస్తా.. అని చెప్పడం సరికాదు అని, అది ప్రజలను వెర్రి వాళ్లను చేయడమేనన్నారు. ముఖ్యమంత్రి గా విశాల దృక్పథంతో పనిచేయాల్సిన అవసరముందని, ఝార్ఖండ్ లో ప్రతీ ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తానని చెప్పారు.
వారసత్వ పరంపరలో భాగంగానే మీరిప్పుడు సీఎం కాబోతున్నారా..? అని అడగ్గా 'పులి కడుపున పులి పుట్టకుండా ఉంటుందా..?' అని చెప్పారు. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ కూటమి గెలుపుతో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలుపొందిన హేమంత్ సొరెన్ ను తూర్పున ఉదయించిన మరో వారసత్వ సూరీడిగా ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వారసత్వం అన్న మాటను హేమంత్ అంగీకరించనప్పటికీ.. తండ్రి ఉద్యమ నేపథ్యం, ప్రజా పలుకుబడి హేమంత్‌కు బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. నిజానికి తన రాజకీయ వారసుడి గా పెద్ద కుమారుడు దుర్గా సొరెన్ కొనసాగాలని శిబు సొరెన్ భావించారు. అందుకు తగ్గట్టే పార్టీ లో దుర్గా సొరెన్‌కు పెద్ద పీట వేశారు. 1995లో జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుర్గా సొరెన్ గెలిచారు. అయితే 39 ఏళ్ల వయసులో దుర్గా సొరెన్ మరణించడం శిబు సొరెన్ ఆలోచనలను తలకిందులు చేసింది. దీంతో రెండో కుమారుడు హేమంత్ సొరెన్‌ను ఆయన తెర మీదకు తెచ్చారు.
అన్న చనిపోయిన నెల రోజులకే రాజకీయా ల్లోకి వచ్చిన హేమంత్ సొరెన్ జూన్,2009లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. జనవరి,2010 వరకు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో రాజ్యసభకు రాజీనామా చేసి అర్జున్ ముండా ప్రభుత్వంలో జార్ఖండ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ రెండేళ్లకే జేఎంఎం-బీజేపీ సంకీర్ణ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత 2013లో ఆర్జేడీ-కాంగ్రెస్-జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కేవలం ఒకటిన్నర ఏడాది మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఇక 2014 లో పార్టీ ఓడిపోవడంతో అయన రాజకీయ చతురత నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం దొరికింది. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపై పోరాడటంలో ఆయన తనదైన మార్క్ చూపించారు. అదే సమయంలో దేశవ్యాప్తం గా ఉన్న రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అలాగే గతంలో ఏడాదిన్నర కాలం పాటు సీఎం గా పనిచేసినప్పటికీ కూడా ఎన్నో కీలక అంశాలపై సరైన నిర్ణయం తీసుకోవడం అయన కి బాగా కలిసొచ్చింది. గిరిజన నేపథ్యం నుంచే వచ్చినప్పటికీ అన్ని వర్గాల ప్రజలకు చేరువవడం లో హేమంత్ విజయం సాధించారు. చూడాలి మరి వచ్చే ఐదేళ్ల పరిపాలనలో అయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ..