ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
ఇప్పటికే ఆయా పార్టీలు నియోజకవర్గాల్లో పార్టీల బలోపేతంపై దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక, బలంగా లేని చోట అభ్యర్థుల మార్పు వంటి చర్యలు చేపడుతున్నాయి.
ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే తనకు ఆఖరి అవకాశమని ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు.
మరోవైపు చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఇదేం ఖర్మ మనకు పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఆ పార్టీ చేపట్టింది. ఇంకోవైపు నియోజకవర్గాల సమీక్షలను సైతం చంద్రబాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు బలంగా ఉంటే వారినే పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అభ్యర్థులు బలంగా లేనిచోట కొత్త అభ్యర్థులను నియమిస్తున్నారు.
ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్‌కు సీటు లేదని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా కోడెల శివరామ్ తనను కలసినప్పుడు చంద్రబాబు సీటు కష్టమని చెప్పినట్టు సమాచారం. మీ నాన్న కోడెల శివప్రసాదరావు పైన గౌరవం ఉందని.. అయితే సీటును మీకివ్వడం కష్టమని చంద్రబాబు తేల్చేసినట్టు చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కోడెల ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలానికే వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి వైవీ ఆంజనేయులు టీడీపీ తరఫున సీటు ఆశిస్తున్నారు. గతంలో ఒక పర్యాయం ఆయన ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. అలాగే తెలుగు యువత నేత మల్లి కూడా సీటు ఆశిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు కూడా సీటు ఆశిస్తున్నారు.
అయితే చంద్రబాబు వైవీ ఆంజనేయులకే సీటు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వైవీ ఆంజనేయులు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను బాగా నిర్వహిస్తున్నారని చంద్రబాబు దగ్గర ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు కోడెల శివరామ్ గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో వ్యాపారుల దగ్గర, షాపుల వాళ్ల దగ్గర కోడెల ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారని తీవ్ర విమర్శలు ఉన్నాయి. వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేశారనే అభియోగాలు వచ్చాయి. ఈ కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో కోడెల శివరామ్‌కు సీటు లేనట్టేనని స్పష్టమవుతోంది. వైవీ ఆంజనేయులే టీడీపీ అభ్యర్థి అని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.